ఇదీ … కాంగ్రెస్ పార్టి నైజం…

ఇదీ … కాంగ్రెస్ పార్టి నైజం

వందేమాతరం వద్దంటారు. పెన్షన్లకు ఎసరు పెడతారు. దేశభక్తుల పేర్లు ఉండొద్దంటారు. పథకాల పేర్లు మార్చేస్తారు. అందలమెక్కగానే అరాచక నిర్ణయాలు. దేశభక్తిని శంకించేలా విరుద్ద చేష్టలు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ సీఎంలపై మండిపడుతున్న ప్రజానీకం. ..తోక వంకర..అందలమెక్కిన‌ అరాచక నిర్ణయాలపై భార‌త్ టుడే ప్ర‌త్యేక క‌థ‌నం

మధ్య ప్రదేశ్ లో 15 ఏళ్ళ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గత ప్రభుత్వాలు అవలభించిన ప్రతిష్టాత్మక నిర్ణయాలను కాలరాస్తోంది. గత పుష్కర కాలంకు పైగా ప్రతి నెల మొదటి తేదీన వందేమాతరం గీతం ఆలపించడం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఆనవాయితీగా మారింది. శివరాజ్ సింగ్ చౌహన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 13 ఏళ్లుగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నారు. కానీ, అకస్మాత్తుగా జనవరి 1న ఆలపించక పోవడంతో వివాదం చెలరేగింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వందమాతరం గేయంపై వివక్ష చూపడం.. ఎమర్జెన్సీ ఉద్యమకారుల పెన్షన్లు చెక్ పెట్టడం.. మాయావతి బెదిరింపులకు తలొగ్గి.. గతేడాది జరిగిన భారత్ బంధ్ విధ్వంసకారులపై కేసులు ఎత్తివేయడం వంటి నిర్ణయాలపై విపక్షాలు మండిపడుతున్నాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తరహాలోనే.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా వ్యవహరిస్తున్నారు. అధికార పీఠమెక్కగానే.. గత బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. జనసంఘ్ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఫొటోలపై నిషేధం విధించడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేతికి అందగానే.. కన్నుమిన్ను కానకుండా వ్యవహరిస్తున్నాయి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయనే విమర్శలు. వెల్లువెత్తుతున్నాయి. అయితే, ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటివి సహజమని సర్దిచెప్పుకున్నా.. వందేమాతరం ఆలపనపై వివక్ష చూపడాన్ని మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత రాజ్యాంగ కూడా జాతీయ గేయంగా గుర్తించిన వందేమాతరానికి.. అడుగడుగునా అవాంతరాలు ఎదరవుతూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు పూర్తయినా కూడా.. ఇప్పటికీ ఈ గేయంపై మన నేతలు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు.

ఈ గేయం వింటే న‌ర‌న‌రాల దేశ‌భ‌క్తి ఉప్పొంగుతుంది :
ఈ జాతీయ గేయం వింటే నరనరాన దేశభక్తి ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్రోద్యమ సమయంలో తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన పాట ఇది. స్వరాజ్యం కోసం అవసరమైతే ఉరికొయ్యలను ముద్దాడలన్నంత స్ఫూర్తినందించిన పాట. బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఒళ్లు హూనం అవుతున్నా వెరవకుండా ప్రతి భారతీయుడూ నినదించిన గేయమది. తెల్లదొరలను హడలెత్తించిన ఆ గేయం.. ఇప్పుడు మన దొరలకు మాత్రం నచ్చడం లేదు. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తీరే ఇందుకు నిదర్శనం.

ప్ర‌తిష్టాత్మ‌క నిర్ణ‌యాల‌ను కాల‌రాస్తోంది :
మధ్య ప్రదేశ్ లో 15 ఏళ్ళ విరామం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గత ప్రభుత్వాలు అవలభించిన ప్రతిష్టాత్మక నిర్ణయాలను కాలరాస్తోంది. గత పుష్కర కాలంకు పైగా ప్రతి నెల మొదటి తేదీన వందేమాతరం గీతం ఆలపించడం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఆనవాయితీగా మారింది. శివరాజ్ సింగ్ చౌహన్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత 13 ఏళ్లుగా వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్నారు. కానీ, అకస్మాత్తుగా జనవరి 1న ఆలపించక పోవడంతో వివాదం చెలరేగింది.

కమల్ నాథ్ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ ఆదేశాలను సరికొత్తగా అమలు చేసేందుకు ప్రస్తుతానికి నిలిపేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ చెబుతున్నా.. ఎవ్వరికి నమ్మకం కుదరటం లేదు. జాతీయ గేయం అంటే కాంగ్రెస్ వారికి అంత వెగటు ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది.

క‌మ‌ల్‌నాథ్ నిర్ణ‌యంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ :
ఇక కమల్ నాథ్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీపై మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చౌహాన్‌.. వందేమాతరం కేవలం జాతీయ గేయం మాత్రమే కాదని.. అది దేశభక్తిగా ప్రతీక అని తెలిపారు. సచివాలయంలో వందేమాతర గేయాన్ని ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. వందేమాతర గేయం ప్రజల హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుందని చెప్పారు.

ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం, దేశభక్తి కన్నా ఏది ఎక్కువ కాదనే విషయాన్ని కాంగ్రెస్‌ మరచిపోరాదని హితవు చెప్పారు. అదే విధంగా మంత్రివర్గం సమావేశాల ప్రారంభానికి ముందు కూడా వందేమాతరాన్ని ఆలపించాలని కోరారు. ప్రభుత్వం దీనిపై స్పందించని పక్షంలో జనవరి 7వ తేదీ ఉదయం 11 గంటలకు దేశభక్తులతో కలిసి సచివాలయ ప్రాంగణంలో తను వందేమాతర గేయాన్ని ఆలపిస్తానని చౌహన్ వెల్లడించారు.

ఇదిలావుంటే, వందేమాతర గేయం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా అంటూ ముఖ్యమంత్రి కమలనాథ్ డొంకతిరుగుడు సమాధానం ఇవ్వడమే కాకుండా.. వందేమాతరం గేయం విషయంలో బీజేపీ అనసవర రాద్దాదంతో చేస్తోందని కమల్ నాథ్ మండిపడ్డారు. వందేమాతరం గేయంపై తాను తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో.. సీఎం కమల్ నాథ్ కొత్త ట్యూన్ వినిపించించారు. వందేమాతరం గేయాన్ని ఆలపించే ప్రక్రియంలో అధికారులతో పాటు సామాన్య జనాలను కూడా భాగస్వామి చేయాలని భావిస్తున్నామని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా తమపై బురదజల్లుతున్నాయని విమర్శించారు. వందేమాతరం పాటు జణ గణ మణ గీతాన్ని ఆలపించాలనే సాంప్రదాయం తీసుకొస్తామని వెల్లడించారు.

అందుకే ఆ పాటను బ్యాన్ చేయించాలని చూశారా..?
మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తన నిర్ణయంపై యూటర్న్ తీసుకోవడంతో.. వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా.. విపక్షాలు స్పందించిన తీరు చూస్తే ఈ అంశం ఇప్పట్లో తేలేలా లేదు. మధ్యప్రదేశ్ లో జనవరి 1న వందేమాతరం ఆలపించలేదనే విషయం తెలియగానే.. బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీకి జాతీయ గేయం నచ్చలేదేమో.. అందుకు ఆ పాటను బ్యాన్ చేయించాలని చూశారని మండిపడ్డారు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి.

మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ తప్పుబట్టారు. ఇలాంటి నిర్ణయాలు దేశానికి మంచివి కాదన్నారు. అలాగే జనవరి 1న వందేమాతరం గేయాన్ని ఆలపించకపోవడాన్ని ఆరెస్సెస్ కూడా తప్పుబట్టింది. అలాగే ఎంపీ రాకేష్ శ‌ర్మ కూడా మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఒకలా.. పీఠమెక్కిన తర్వాత మరోలా ప్రవర్తిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వందేమాతరం గేయం ఆలోపించకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

About The Author