చిరుత దాడిలో ఆవు మృతి భయాందోళనలో గ్రామస్తులు.


చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చుక్కవారిపల్లి అటవీ ప్రాంతం లో ఆవుఇతరపై చిరుతపులి పంజా విసిరింది. చుక్క వారి పల్లి కి చెందిన రామాదూల మనోహర్ అనే రైతు ఆవుపై గ్రామ శివారు నల్ల బండ్ల అటవీ ప్రాంతంలో దాడి చేసి చంపేసింది. గతంలోనూ రెండు ఆవులను చంపిందని గ్రామస్థులు తెలిపారు. పొలం పనులకు వెళ్లాలంటే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.ఎప్పుడు, ఎవరిపై దాడి చేస్తుందోనని గ్రామ శివారులోని అటవీ ప్రాంతం ఉన్నదని గ్రామవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తులు అన్నారు. ఇప్పటికైనా స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని కోరుతున్నారు.