తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు


బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు తప్పని సరిగా మాస్క్ ధరించాలి

– భక్తుల కోసం తిరుమల ,అలిపిరిలో తాత్కాలిక వసతి ఏర్పాట్లు

– అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

– రద్దీకి తగ్గట్టు పగడ్బందీ ఏర్పాట్లు

-. టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి

సెప్టెంబర్ 27 వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు . రెండున్నరేళ్ల తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాలుగు మాడ వీధుల్లో నిర్వహిస్తుండటం ,పెరటాశి మాసం రావడంతో భక్తులు భారీగా వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు . బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు మాస్క్ తప్పని సరిగా ధరించాలన్నారు .తిరుమల ,అలిపిరి లో భక్తుల కోసం తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేస్తామన్నారు .
అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి ఈవో శ్రీ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి తో కలసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష జరిపారు . అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు . ఆవివరాలు ఇవీ ….

– సెప్టెంబ‌రు 26న‌ అంకురార్ప‌ణ. అదేవిధంగా, సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం.

– తొలిరోజైన‌ సెప్టెంబర్ 27న సాయంత్రం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జ‌గన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్ప‌ణ‌.

– బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధానంగా అక్టోబరు 1న గరుడ సేవ, 2న స్వ‌ర్ణ‌ర‌థం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం.

– తొలిరోజు ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా రాత్రి 9 గంట‌ల‌కు పెద్ద‌శేష వాహ‌నసేవ. మిగ‌తా రోజుల్లో ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు.

– క‌రోనా కార‌ణంగా రెండేళ్ల త‌రువాత మాడ వీధుల్లో శ్రీ‌వారి బ్రహ్మోత్సవ వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు.

– సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేస్తూ స‌ర్వ‌ద‌ర్శ‌నం మాత్ర‌మే అమ‌లు. ఆర్జిత సేవ‌లు, శ్రీ‌వాణి, విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నం త‌దిత‌ర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.

– పెర‌టాసి మాసం. రెండో శ‌నివారం నాడు గ‌రుడ‌సేవ రావ‌డంతో ర‌ద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు. భక్తులకు విరివిగా అన్న ప్రసాదం అందించడానికి అవసరమైన ఏర్పాట్లు .

– భక్తుల రద్దీకి తగ్గట్టు ప్ర‌తిరోజూ 9 ల‌క్ష‌ల లడ్డూల బ‌ఫ‌ర్ స్టాక్.

భ‌ద్ర‌త : సెక్యూరిటీ, పోలీసుల స‌మ‌న్వ‌యంతో బందోబ‌స్తు, ట్రాఫిక్ నియంత్ర‌ణ, పార్కింగ్‌ ఏర్పాట్లు. వాహనాల పార్కింగ్ మొత్తం రింగ్ రోడ్డులో చేసి , భక్తులను ఉచిత బస్సుల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు .

– 24/7 కంట్రోల్ రూమ్‌, సిసి కెమెరాలతో నిఘా.

ఇంజినీరింగ్ : గ్యాల‌రీలు, క్యూలైన్లు త‌దిత‌ర ఇంజినీరింగ్ ప‌నులు స‌కాలంలో పూర్తి.

– అలిపిరి వ‌ద్ద ద్విచ‌క్ర వాహ‌నాలు, నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ప్ర‌త్యేకంగా పార్కింగ్ సౌక‌ర్యం.

– నిరంత‌రాయంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా. జ‌న‌రేట‌ర్లు సిద్ధం.

– శ్రీ‌వారి ఆల‌యం, అన్ని ముఖ్య కూడ‌ళ్ల‌లో ఆక‌ట్టుకునేలా విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు.

ప్ర‌జాసంబంధాల విభాగం : 3,500 మంది శ్రీ‌వారి సేవ‌కులు. ఫొటో ఎగ్జిబిష‌న్‌, మీడియా సెంట‌ర్ ఏర్పాటు

ఆరోగ్య విభాగం : ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికుల‌ను అద‌నంగా ఏర్పాటు.

వైద్య విభాగం :. తిరుమల తో పాటు అలిపిరి , తిరుపతిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్పెష‌లిస్టు డాక్ట‌ర్లు, ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, 10 ప్రత్యేక అంబులెన్సుల ఏర్పాటు.

ర‌వాణా : ఎపిఎస్ఆర్‌టిసి ద్వారా త‌గిన‌న్ని బ‌స్సులు. గ‌రుడ‌సేవ రోజున ఎక్కువ బ‌స్సులు.

– తిరుమ‌ల-తిరుప‌తి ఘాట్ రోడ్ల‌లో గ‌రుడ‌సేవ నాడు పూర్తిగా, మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ద్విచ‌క్ర వాహ‌నాల రాక‌పోక‌ల నిషేధం. కొండ మీద వాహనాల రద్దీ ని బట్టి అవసరమైతే అలిపిరిలో వాహనాల నియంత్రణ .
హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ : శ్రీ‌వారి వాహ‌న‌సేవ‌ల ముందు విభిన్న క‌ళారూపాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ఏర్పాటు. ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల కళాకారులకు అవకాశం
జెఈవో లు శ్రీమతి సదా భార్గవి , శ్రీ వీర బ్రహ్మం , సివి ఎస్వో శ్రీ నరసింహ కిషోర్ , ఎస్వీబీసీ సి ఈవో
షణ్ముఖ కుమార్ , అదనపు ఎస్పీ లు శ్రీ కులశేఖర్ , శ్రీమతి విమల కుమారి , డిప్యూటీ
ఈవో లు శ్రీ హరీంద్ర నాథ్. శ్రీ రమేష్ బాబు ,, వి జి వో శ్రీ బాలిరెడ్డి తో పాటు డిఎస్పీలు , సి ఐ లు పాల్గొన్నారు
———————————————/
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది