తెలంగాణ ఉద్యమకారుల సన్మాన పోస్టర్లు ఆవిష్కరణ.


ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కే. వి. కృష్ణారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ పాల్గొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన భవనం లో తలపెట్టిన అమరవీరుల సన్మాన సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్లను మంగళవారం స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆవిష్కరించారు . మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని , తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలని , అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ కారుల డిక్లరేషను ప్రకటించాలని , ఉద్యమ కారులకి పెన్షన్ , వడ్డీలేని ఋణాలు , ఉచిత బస్పస్ , ఆరోగ్యకార్డులు , సంక్షేమ పథకాలలో 20% వాట కేటాయించాలని , ఉద్యమ కారులని తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి గౌరవించాలని , జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో కుడా అమలు చేయాలని , అన్ని రాజకీయ పార్టీలలో ఉద్యమకారులకి ప్రాధన్యతను ఇవ్వాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఫోరం నాయకులు డాక్టర్ కంటే సాయన్న పటోళ్ల సురేందర్ రెడ్డి , అర్వ పల్లి విద్యాసాగర్ , డోకుపర్తి సుబ్బారావు , పాలకుర్తి కృష్ణ, పద్మా చారి , లింగాల రవికుమార్ , గుంతేటి వీరభద్రం , నయీం , డాక్టర్ అజీమ్ , అబ్బాస్ , బర్హాన్ , జానీ (రాజ్ కుమార్), శ్రీనివాస నాయక్ , గంగాధర్ , తెలంగాణా శ్రీనివాస్ , విజయ్ , పమ్మి రవి , పాగి వెంకన్న , యస్ . రాంబాబు , వీరన్న నాయక్ , బద్రునాయక్ , మిట్టపల్లి రవి , శ్రీనివాసరెడ్డి, రయిస్ , అన్వర్ , జంగిపల్లిరవి , నరేష్ , దామల్ల సత్యనారాయణ , వెంకటేశం గౌడ్ , విష్ణువర్ధన్ , నరేందర్ గౌడ్ , నరసింహా గౌడ్ , తోట మోహన్ , జంగా సుదర్శన్ , కాంతం వీరస్వామి , నారపోగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు . అనంతరం రయీస్ అన్వర్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నగర చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది .