108 సిబ్బంది ముసుగులో ప్రైవేట్ అంబులెన్సుల దందా..


హనుమాన్ జంక్షన్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108 104 సర్వీస్ లను వారి సిబ్బంది దారి మళ్లిస్తున్నారు.పేద ప్రజలకు సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా రూపొందించిన 108 సిబ్బంది చేస్తున్న పనుల వల్ల ప్రాభవం కోల్పోతోంది. కొంత మంది సిబ్బంది పేద ప్రజల రెక్కల కష్టాన్ని తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవటం సర్వత్ర విమర్శలకు దారితీస్తుంది.108 కి కాల్ చేసిన వారి వివరాలు సేకరించి అత్యవసరం అన్నవారికి ప్రెవేటు అంబులెన్స్లను పంపి సొమ్ము చేసుకుంటున్నారు. దీనికి 108 సిబ్బంది సహకారంతో పాటు తమ కుటుంబ సభ్యుల పేర్లతో స్వంతంగా అంబులెన్సు లను నిర్వహిస్తున్నారు. వారికి ప్రజా ప్రతినిధులు సహకరించటం కోసం మెరుపు. బాపులపాడు మండలానికి కేటాయించిన డ్రైవర్ గత 3 సంవత్సరాల నుండి ఇదే కార్యక్రమంలో నిర్వహిస్తుండగా తాజాగా టెక్నీషియన్ కూడా అదే బాటలో స్వంత ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహిస్తున్నారు. అధికాదాయ వనరుగా అంబులెన్స్ సేవలను వినియోగించడం పట్ల సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.ఈ ఉదంతంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన కరువైంది. గత నెలలో షోకాజ్ నోటీసు జారీ చేసినా ఇంత వరకూ సమాధానం చెప్పకుండా దందా కొనసాగించడం చూస్తుంటే దీనిలో కొందరు అధికారులతో పాటు నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ వైఫల్యానికి ఈ విషయం నిలువుటద్దంలో కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు పేద ప్రజలకు అండగా నిలబడవలసిన వారు దళారి వ్యవస్థకు కొమ్ముగాయటం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పకనే చెబుతుంది.