చల్లగా నూరేళ్ళు వర్ధిల్లు ,,స్వాతి…


దురంతో ఎక్స్ప్రెస్ లో తెల్లవారుజామున ఒక బిడ్డకు జన్మనిచ్చిన శ్రీకాకుళం వాసి .సోమవారం రాత్రి సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం బయలుదేరిన దురంతో ఎక్స్ప్రెస్ లో గర్భిణీ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చినడం జరిగింది ….

రాజమండ్రి దాటిన తర్వాత B6 కంపార్ట్మెంట్ లో అనూహ్యంగా ఒక స్త్రీ పురిటి నొప్పులు బాధపడటం జరిగింది .

అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న గీతం మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయినా డాక్టర్ స్వాతి రెడ్డి అదే కంపార్ట్మెంట్లో ప్రయాణించడం యాదృచ్ఛికం.

రాజమండ్రి నుంచి అనకాపల్లి మధ్యలో అదే బోగీలో డాక్టర్ స్వాతి రెడ్డి తోటి మహిళా సహాయం తీసుకుని డెలివరీ చేయడం జరిగింది .

తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు డాక్టర్ స్వాతి గారు తెలిపారు. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన తోటి ప్రయాణికులు అందరూ అభినందనలు తెలిపారు.

ట్రైన్లో ప్రయాణిస్తున్న టీటీ అనకాపల్లి లో దురంతో ఎక్స్ప్రెస్ ను నిలిపి అప్పటికే వేచి ఉన్న 108 లోనికి తల్లి బిడ్డ తో డాక్టర్ స్వాతి వారిని తీసుకొని ఎన్టీఆర్ ప్రభుత్వ హెల్త్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి బిడ్డకు కావలసిన వ్యాక్సినేషన్స్ ఇప్పిచ్చినట్టు తెలిసింది.

దూరంతో ఎక్స్ప్రెస్ రైల్లో జన్మించిన ఈ బిడ్డకు జీవిత కాలం అంతా ఉచిత రైలు ప్రయాణం కల్పిస్తామని అనకాపల్లి లో ఉన్న స్టేషన్ మాస్టర్ చెప్పడం జరిగింది .

గీతం మెడికల్ కాలేజ్ చేరిన డాక్టర్ స్వాతిని గీతం కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు గైనకాలజీ డిపార్ట్మెంట్ తోటి విద్యార్థులు అభినందనలు తెలిపారు .

ఈ సందర్భంగా డాక్టర్ స్వాతి మాట్లాడుతూ తను గీతం మెడికల్ కాలేజీలో house surgeon చేస్తున్నట్లు తెలిపారు.

రాత్రి సమయంలో అదే రైలులో ప్రయాణించటం కళ్ళముందే జరుగుతున్న ప్రసన్న వేదనను తన గమనించానని…..

వెంటనే పక్కనున్న కొంతమంది తోటి ఆడవారి సహాయం తీసుకొని చక్కగా డెలివరీ చేయడం….

నా జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం అని తెలిపారు.

మనం అందరం కూడా…డాక్టర్ స్వాతి కి అభినందనలు తెలియ చేద్దాం ఫ్రెండ్స్