రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి వారి ముఖ్య గమనిక..


గత 2 – 3 రోజుల నుండి వాట్సప్ గ్రూపులో ప్రత్తి పంటలో ఒక పురుగు వుంది.. ఆ పురుగు మనిషిని తాకిన వెంటనే 5 నిముషాలలో మనిషి చనిపోతున్నాడు అని, జాగ్రత్తగా ఉండండి అని అందర్నీ భయపెడుతూ పురుగు ఫోటోలు, చనిపోయినట్టు ఉన్న మనుషుల ఫోటోలను, ఆడియో సందేశాలను తెగ పంపిస్తున్నారు.. (ఆ పురుగు ఫోటోను కింద ఇవ్వడం జరిగింది)

ఇందుమూలంగా రైతాంగానికి తెలియజేయునది ఏమనగా, వాట్సాపు గ్రూపుల్లో పంపించే పురుగు ఎక్కువగా చెరకు మరియు పండ్ల తోటల్లో కనిపిస్తోంది. ఈ పురుగు లద్దె పురుగు ఆకారంలో ఉండి, శరీరంపై వెంట్రుకలతో ఉంటుంది. ఈ వెంట్రుకల చివరిభాగం లో స్వల్ప విషపూరిత పదార్థం ఉంటుంది. ఇది ఆ పురుగుకు ఆత్మరక్షణ కోసం ఉంటుంది. ఇది ఆకుల క్రింది వైపు ఉండి, ఆకులను తింటూ ఉంటుంది. ఈ పురుగు ప్రత్తి పంటలో అసలు కనపడదు.
ఒకవేళ ఈ పురుగు మన శరీరంలో ఎక్కడైనా తగిలితే, పురుగు వెంట్రుకలలో ఉండే స్వల్ప విష పదార్థం మన శరీరానికి తగలడం వల్ల, తగిలిన చోట దురద, మంట కలగడం జరుగుతుంది.. ఎక్కువగా తగిలిన చోట వాపు రావచ్చు.. ఇది కూడా ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. మనిషి చనిపోయేoత ప్రమాదం ఉండదు..
దయచేసి రైతులందరూ దీనిని అర్థం చేసుకొని ఇటువంటి నిరాధార విషయాలను నమ్మకండి.. ఈ విషయాన్ని ఇతరులతో పంచుకొని వారి సందేహాలను నివృత్తి చేయగలరని మా మనవి..

*ఇట్లు*
*ప్రోగ్రామ్ కోఆర్డినేటర్*
*కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి*

+91 94947 46171