స్పోర్ట్స్ మీట్ లో సత్తా చాటిన ఖమ్మం జిల్లా ఎస్.ఆర్ & బిజీ.ఎన్.ఆర్ టీమ్.


కర్నూలు జిల్లాలో జరిగిన సిల్వర్ జూబ్లీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో సత్తా చాటిన ఎస్.ఆర్ & బిజీ.ఎన్.ఆర్ అటానమస్ ప్రభుత్వ కళాశాల , ఖాంబద్రి టీమ్ ప్రతి ఈవెంట్లో తన ప్రత్యేకతలు నిలుపుకుంది . ఈ ఖాంబద్రి టీమ్ కు దేవకి ఫౌండేషన్ ద్వారా దేవకి వాసుదేవరావు స్పాన్సర్ చేశారు . వీరి ఆధ్వర్యంలో వెళ్లిన ఖమ్మం జిల్లా జట్టులు అనేక విభాగాలలో విజయం సాధించింది . కబడ్డీ విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది . కబడ్డీ కెప్టెన్ సాయి బంగారు పతకాన్ని అందుకున్నారు . సెట్టిల్ లో కూడా బంగారు పతకాన్ని గెలుచుకుంది . అలాగే 100 మీటర్ల పరుగు పందెంలో నవీన్ కూడా బంగారు పతకాన్ని సాధించాడు . షార్ట్ పుట్ లో మజీద్ బంగారు పతకాన్ని ముద్దాడాడు . అలాగే వాలీబాల్ పోటీలో సెకండ్ ప్లేస్ లో నిలిచింది . వాలీబాల్ కెప్టెన్ లక్ష్మణ్ సిల్వర్ మెడల్ అందుకున్నారు . ఐదు కిలోమీటర్ల పరువు పందెంలో కుమార్ సిల్వర్ మెడల్ ను సాధించాడు . కర్నూల్ సిల్వర్ జూబ్లీ కాలేజీలోనే చదువుకున్న దేవకి వాసుదేవరావు స్పాన్సర్ చేసిన ఎస్.ఆర్ & బిజీ.ఎన్.ఆర్ కాలేజీకి అనేక విభాగాల్లో విజయం సాధించడం చెప్పుకోదగిన విషయం . ఈ సందర్భంగా దేవకి ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవకి వాసుదేవరావు మాట్లాడుతూ.. సత్తా చాటిన విద్యార్థులను దేవకి వాసుదేవరావు అభినందించారు . ఇలాగే కృషి చేసి అంతర్జాతీయ స్థాయిలో భారత పతకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు . చదువుతోపాటు , క్రీడలకు కూడా సమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు . క్రీడాకారులకు దేవకి ఫౌండేషన్ తరపున ఎల్లప్పుడు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దేవకి వాసుదేవరావు తెలియజేశారు . ఈ సందర్భంగా ఎస్.ఆర్ & బిజీ.ఎన్.ఆర్ అటానమస్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరు ను అభినందించారు . ఖాంబద్రి టీమ్ ను దగ్గర ఉండి నడిపించిన విజయం సాధించేలా కృషి చేసిన ఫిజికల్ డైరెక్టర్ బట్టు వెంకన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.