తెలుగుదేశం హయాంలోనే పట్టణంలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం:


5వ వార్డులో బాదుడే బాదుడు
ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపి ఇంచార్జ్ శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం గిద్దలూరు పట్టణంలోని 5వ వార్డు నందు స్థానిక టీడీపి నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు వార్డులో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణి చేస్తూ ఈ మూడేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన నిత్యావసర ధరల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని కరెంట్ బిల్లులు ఆర్టీసీ చార్జీలు గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచారని ప్రజలకువివరించారు నాడు తెలుగుదేశం హయాంలో నాటి శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి కృషితో గుండ్లమోటు నుండి పైప్ లైన్ ద్వారా నీటిని అందించి పట్టణంలో ప్రతీ వార్డులో త్రాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయటం జరిగిందని సిమెంట్ రోడ్లు అర్హులకు సంక్షేమ పథకాలు అందించటం దుల్హన్ పథకం పెళ్లి కానుక ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి అనేక పథకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూర్చటం జరిగిందని గుర్తు చేశారు మళ్ళీ అలాంటి సంక్షేమం జరగాలంటే రాబోవు రోజుల్లో పేద మధ్య తరగతి ప్రజలు మెచ్చే పరిపాలన తెలుగుదేశంతోనే సాధ్యం అని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుంటేనే ప్రజా సంక్షేమం సాధ్యం అని అన్నారు

ఈ కార్యక్రమంలో 5వ వార్డు టీడీపీ టీడీపీ నాయకులు జిల్లెల్ల సంపత్ కుమార్ రెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ యాదవ్ 2వ వార్డ్ కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్ నిరంజన్ రెడ్డి పార్లమెంట్ అధికార ప్రతినిధి షేక్ పెద్ద భాష కాపు నాయకులు ఉలాపు బాల చెన్నయ్య ఎలిశెట్టి వెంకటప్ప షేక్ మహబూబ్ బాషా జిఎం వలి సుబ్బారాయుడు రమణ విష్ణు యాదవ్ ఓబయ్య అలీ అక్బర్ అనప వీరశేఖర్ నిఖిల్ రహీం అలీ మరియు పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.