నల్లమల్ల దారిలో…. ఊహించని బాటసారి..
అది నల్లమలలోని లోతట్టు ప్రాంతం. నాగర్‌కర్నూలు జిల్లాలోని వటవర్లపల్లి, ఫరాహాబాద్‌ల మధ్య ఉన్న దట్టమైన అటవీ క్షేత్రం. సమయం ఉదయం 7 గంటలు.
నడి అడవిలో అప్పుడప్పుడే తెల్లవారుతోంది.ఇంతలో శ్రీశైలం రహదారి పైకి ఓ పెద్ద పులి ఠీవీగా నడుచుకుంటూ వచ్చింది.
అంతే.. ఆ దృశ్యాన్ని చూసిన వాహనదారుల గుండెలు జల్లుమన్నాయి. అంతలోనే తేరుకుని సెల్‌ఫోన్ కెమెరాలను ఓపెన్ చేశారు. పులి దర్జాగా రోడ్డు దాటుతున్న దృశ్యాలను క్లిక్‌మనిపించారు.
సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఉదయం వేళ రోడ్డుపై పులి కన్పించడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.