ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి


ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావు‌ను సినిమా వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. తండ్రి మణియ్య. తల్లి వియ్యమ్మ, 1944 మే 8న పుట్టిన చలపతిరావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు..కుమారుడు రవిబాబు టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు.