పసిపిల్లలు వేధిస్తున్నారని వదిలి వెళ్ళిపోయిన తండ్రి.


దిక్కుతోచని స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించి వారి బంధువులకు అప్పగించిన దిశ పోలీసులు.

సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి నగరం గాంధీ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. చిన్న షాపుల నుండి అతిపెద్ద షాపుల వరకు రద్దీగా ఉంటుంది. పండగ వచ్చిందంటే చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కొత్త బట్టలు కొనడానికి మరియు ఇతరాత్ర వస్తువులు కొనడానికి ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు.ఇదే క్రమంలో చంద్రగిరికి చెందిన ఒక తండ్రి మరియు తన ఇద్దరు పిల్లలు బట్టలు కొనడానికి వచ్చారు, కానీ పిల్లలు అతిగా గారాబం చేస్తున్నారని మందలించినా, వినడం లేదని విసిగి చెంది ఇద్దరు పిల్లలు ప్రియ వర్షిని (8 సం ” లు) జస్వంత్ (4 సం ” లు) లను కర్కోటకంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.

ఇదే సమయంలో జిల్లా ఎస్పీ శ్రీ. పి. పరమేశ్వర రెడ్డి ఐపిఎస్., వారి ఆదేశాల మేరకు చిన్నపిల్లలు, మహిళల యొక్క భద్రత ధ్యేయంగా వారి భద్రత కొరకు దిశా మహిళా పోలీస్ బృందాన్ని 24 x 7 రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు బస్టాండ్, రైల్వే స్టేషన్,మరియు విద్యాలయాల వద్ద నిరంతరం పెట్రోలింగ్ చేస్తూ ఉండాలని ఇదివరకే ఆదేశించి ఉన్నారు. ఆ మేరకు ఈరోజు గాంధీ రోడ్డు నందు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ ఇద్దరు చిన్నారులు దిశా మహిళా పోలీసుల కంటపడ్డారు. వెంటనే వారిని చేరదీసి విచారించగా తమది చంద్రగిరి అని మా నాన్న మేము కోరుకున్నది కొనివ్వమని అడగగా మమ్మల్ని మందలించి కొట్టి వెళ్లిపోయాడని ఏడుస్తూ బాధను వెలిబుచ్చారు.

చిన్నపిల్లలు ఇచ్చిన సమాచారం మేరకు వారి తండ్రిని విచారించగా అతని సరైన సమాధానం చెప్పక అసహనాన్ని వెలబుచ్చాడు. పదే పదే ఫోన్ చేసినా సమాధానం చెప్పలేదు, తదుపరి వారి బంధువులను గుర్తించి వారి కోరిక మేరకు పిల్లలను దిశ మహిళా పోలీసు వారు చంద్రగిరి వెళ్లి వారి బంధువులకు అప్పగించి అలాగే కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

చిన్నపిల్లలను చేరదీసి వారు మరింత భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే వారి బంధువులను గుర్తించి వారికి అప్పగించిన తీరును జిల్లా ఎస్పీ శ్రీ.పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు దిశ మహిళా పోలీసులను అభినందించారు.