ఏపీ హోం మంత్రి సలహాదారుగా… మాజీ ఐపీఎస్…
మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి, వైసీపీ హిందూపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ను హోం శాఖామంత్రి సలహాదారుగా ముఖ్యమంత్రి జగన్ నియమించారు…
కీలకమైన హోం శాఖ నిర్వహణలో తొలిసారి మంత్రిపదవిని పొందిన మేకతోటి సుచరిత కు ఇక్బాల్ వంటి సీనియర్ మాజీ అధికారి నియామకం ఖచ్చితంగా అదనపు బలమనే చెప్పవచ్చు…
మరో ఆశక్తికర అంశం… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు భద్రతను కుదించారు అనే ఆరోపణల నేపథ్యంలో… గతంలో చంద్రబాబు వ్యక్తిగత భద్రత అధికారిగా పనిచేసిన ఇక్బాల్ ను హోం మంత్రి సలహాదారుగా నియమించడం చూస్తే… ఒక్క నియామకంతో… అటు శాఖాపర నిర్వహణలోను, ఇటు భద్రత కుదింపు విమర్శలకు జగన్ చెక్ పెట్టినట్లేనంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.