మొలత్రాడు ఎందుకు కడతారు..?


ధర్మా సందేహం…
మొలత్రాడు ఎందుకు కడతారు..?

మొల … మనిషి శరీరానికి మధ్యగల నడుముప్రాంతాన కట్టే తాడునే మొలతాడు లేదా మొలత్రాడు అంటారు.
హిందూ సాంప్రదాయంలో పాటించే పద్దతులలో ఎదో ఒక సైన్స్ అంతర్లీనంగా దాగి ఉంటుంది అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు.
కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.
మొలతాడు దిష్టి తాకకూడదని కూడా కడతారు .
మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం .
ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది.
చిన్నపిల్లలకు మొలతాడు కడితే ,వాళ్ళు పెరుగుతున్న సమయంలో … వాళ్ళ ఎముకలు ,కండరాలు సరియైన పద్ధతిలో వృద్ధిచెందుతాయి. ముఖ్యంగా మగచిన్నపిల్లలు పెరిగే సమయంలో పిల్లల పురుషాoగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండా ఖచ్చితమైన పెరుగదలకు తోడ్పడుతుంది, గనుక మొలతాడు కడతారు. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
శిశువు జన్మించిన తరువాత మనవారు మొదట చేసే పని అదే …
చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు.
పెళ్ళైన పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే.ధరించకపోతే పెళ్ళాం చచ్చిందా? అంటారు
నీ “మొలత్రాడు తెగిపోను” అని శాపనార్ధం లాంటి తిట్టు / మాట వాడుకలో ఉంది.
పురుషుడి భార్య ఒకవేళ కాలం చేస్తే … మొలత్రాడు తీసివేయాలి అన్న నమ్మకం/ఆచారం ఇప్పటికీ ఉంది.
మగవారు చనిపోయిన తరువాత శరీరాన్ని చితిలో దహనం చేసేముందు ఈ మొలతాడుని తప్పనిసరి తెంపుతారు.
మొలత్రాడులు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం.
పురుషులు ధరించే లుంగీ, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడుకి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉంది.
మగవారికి “హిర్నియా” అనే వ్యాధి రాకుండా కూడా మొలతాడు కాపాడుతుంది. దీనిని పలువురు శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు.
శరీరాన్ని మధ్యాగా బాహ్యరూపంలో విభజించి చూపుతుంది ,మొలత్రాడు కట్టిన పై భాగం అలంకారం,పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్ధం
స్నానాల వలన నీళ్ళని పీల్చటం వలన మొలత్రాడు మెత్తబడి, లేక ఉదరభాగం పెరిగి మరీ బిగుతుగా ఉండటం మూలాన కొంత కాలానికి అది తెగిపోతుంది. అప్పుడు మరల క్రొత్తది కొనాలి.
ఒక చిన్న సూచన … మొలత్రాడు కి పిన్నీసులు లాంటివి కట్టకూడదు .
సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా ఉంది. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యంలో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.
ఈ క్రింది పద్యం రెండు దశాబ్దాలకింద అన్ని పాఠశాలలో చెప్పించేవారు,చదివించేవారు.
చేతవెన్నముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టీ
సందె తాయత్తులను, సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను నే చేరి కొలుతు !

” మరళా ఇదే శుభ సమయంలో మరొక్క ధర్మా సందేహంలో కలుసుకుందాం నేస్తాలు ” సెలవు …

About The Author