టీడీపీకి చెవిరెడ్డి రాజీనామా సవాల్…


గతంలో చంద్రబాబు నాయుడు టైమ్ లో శాసనసభ జరిగిన తీరుపై విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాల్ చేశారు.అచ్చెన్నాయుడు ఇప్పుడు సుమతి శతకాలు చెబుతున్నారని, గతంలో ఎంత అరాచకంగా మాట్లాడింది అందరికి తెలుసునని ఆయన అన్నారు. సభ ఆర్డర్‌లో లేనప్పుడు సభను ఎలా నడుపుతారని టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించగా, గత ఐదేళ్లలో సభ ఆర్డర్‌లో లేనప్పుడు ఒక్కసారి కూడా సభను నడపలేదా? అలా నడపలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. లేదంటే కేశవ్‌ రాజీనామా చేయాలి’’ అని చెవిరెడ్డి సవాల్‌ విసిరారు. గత ఐదేళ్లలో అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు చూస్తే అతనికే అసహ్యం పుడుతుందన్నారు.దీనిపై తాను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇస్తానని, మీరు కూడా ఇస్తారా అని ఆయన సవాల్ చేశారు.

About The Author