భూ యజమానుల చేతికి బ్రహ్మాస్త్రం


* నకిలీ భూ పత్రాలు, రికార్డుల్లో అవకతవకలకు చెల్లు
* ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2019తో ప్రయోజనాలు
‘‘పదుల సంఖ్యలో ఉన్న భూమి రికార్డుల స్థానంలో భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా ఒక రికార్డు సరిపోతుంది. భూ పత్రాలను, రికార్డులను టాంపరింగ్‌ చేయకుండా నిరోధించేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని’’ అధికారిక వర్గాలు తెలిపాయి.
సివిల్‌ కోర్టుల్లో ఉండే కేసుల్లో 66% భూ వివాదాలే ఉంటున్నాయి. దేశంలో జరుగుతున్న హత్యల్లో 14% భూ వివాదాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. రెవెన్యూ కోర్టుల్లోనూ వేల సంఖ్యలో ఈ లిటిగేషన్స్‌ ఉంటున్నాయి.

About The Author