సీఎం కేసీఆర్ రాకతో చింతమడక గ్రామం నేడు పులకించి పోతున్నది


– పుట్టి పెరిగిన ఊరును పునర్నిర్మాణం చేసేందుకు చింతలేని చింతమడక గా తీర్చిదిద్దేందుకు విచ్చేసిన గౌ! ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారికి గ్రామ ప్రజలందరూ ఉప్పొంగిన గుండెలతో, ఉత్సాహంగా స్వాగతం తెలియజేస్తున్నారు

– ఆయనను చిన్నప్పటి నుంచి చూసినవాళ్ళు, చిన్ననాటి దోస్తులు ఎవరెవరైతే ప్రేమతో ఈ సమావేశానికి విచ్చేసినారో వారందరికీ,గౌరవ ముఖ్యమంత్రి గారికి సిద్ధిపేట శాసన సభ్యునిగా నేను సాదరంగా స్వాగతం పలుకుతున్న

– జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నారు పెద్దలు

– ఉన్నఊరు కన్నతల్లి స్వర్గంకన్నా మిన్న

– మీ అందరి ప్రేమను పంచుకొని యావత్ రాష్ట్రం సాదించడం మనందరికీ గర్వకారణం.

– అందరికి ఊరు గుర్తింపు తెస్తే… మన ఊరికి మన రాష్ట్రానికీ గుర్తింపు తెచ్చిండు మన కే.సి.అర్.

– మీది ఎ ఊరు అంటే సంగారేడ్దో, సిద్దిపెటనో అంటారు మాది కే.సి.అర్. ఊరు అని గర్వంగా చెప్పుకుంటారు చింతమడక ప్రజలు.

– ఉద్యమ కాలంలో అడుగడుగునా ఈ గడ్డ అండగా నిలిచింది..ఈ చింత మడక గ్రామం…

– నిమ్స్ లో నిరాహార దీక్షచేసినప్పుడు చింత మడక ఛిన్నబోయింది.. ప్రజాలంతా టి.వి.ల ముందు కూర్చొని మిమ్మల్ని చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు. ఒక్క ఇంట్లో పొయ్యి వేలుగలేదు ఎవరి నోట్ల అన్నం ముద్దా పోలేదు.

– కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ గడ్డకు ఎం ఎల్ ఎ సేవచేసే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతంగా బావిస్తున్నాను.

– ఈ గ్రామములో ప్రతి ఇంచు మీకు తెలియంది కాదు గ్రామంలో జరిగిన ప్రతి అభివృద్ధి మీ కనుసన్నల్లో జరిగినదే.

– నాడు జన్మభూమిలో స్వంత ఇంటిని ఊరి బడికి రాఘవరావు – వెంకటమ్మల పేరుతొ మీరు ఇచ్చిన స్పూర్తి గొప్పది.

– మీ ఆశీర్వాదం తో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామములో ప్రాథమీక ఆరోగ్య కేంద్రం, పశువుల దవఖాన, బ్యాంక్, సిద్ధిపేట దుబ్బాక డబుల్ రోడ్డు, పాటశాల నిర్మాణం ఇలా కొన్ని పనులు చేసుకున్నాం.

– గ్రామ అభివృద్ధి పై, నియోజకవర్గ అభివృద్ధి పై నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను..

– మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

About The Author