సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు!

తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 30 నుండి అక్టోబ‌రు 8 తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు, రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు స్వామివారు వివిద‌ వాహనాల‌పై తిరుమాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇస్తారు.

ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 24న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 29న అంకురార్పణం నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి
30-09-2019 (సాయంత్రం) ధ్వజారోహణం,పెద్దశేషవాహనం.

01-10-2019 చిన్నశేష వాహనం హంస వాహనం

02-10-2019 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

03-10-2019 కల్పవృక్ష వాహనం స‌ర్వభూపాల వాహనం

04-10-2019 మోహినీ అవతారం గరుడ వాహనం
(రా.7 నుండి 12 వరకు)

05-10-2019 హనుమంత వాహనం స్వర్ణరథం (సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

06-10-2019 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

07-10-2019 రథోత్సవం అశ్వ వాహనం

08-10-2019 (ఉ.7.00 గంటలకు)చక్రస్నానం ధ్వజావరోహణం

About The Author