టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇస్తారా!!!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. రాజకీయ విశ్లేషకులు కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అంచనా వేసారు కానీ 23 స్థానాలకే పరిమితమవుతుందని అంచనా వేయలేకపోయారు. ఈ 23 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడానికి ప్రయత్నిస్తున్నారు. వైసీపీ పార్టీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా వైసీపీలోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండటంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ వైసీపీలోకి వెళ్ళట్లేదు.
కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడటం కోసం టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి సిధ్ధంగా ఉంది.గతంలో చంద్రబాబు విదేశాలకు వెళ్ళిన సమయంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనకు వెళ్ళబోతున్నారు. చంద్రబాబు ఆదివారం విదేశాలకు వెళ్ళాక టీడీపీ ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు కొంతమందైనా బీజేపీలో చేరబోయే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి చంద్రబాబు విదేశాలకు వెళ్ళినా టీడీపీ నేతలు ఎవరూ పార్టీ మారకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి.