ఎలక్ట్రిక్ వాహనాలపై GST 5%కి తగ్గింపు…
ఎలక్ట్రిక్ వాహనాలపై GSTని 5 శాతానికి తగ్గిస్తూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యుత్ ఛార్జర్లపై కూడా GSTని 5%నికి తగ్గించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు వాహనాలపై 12శాతం, ఛార్జర్లపై 18శాతం GST ఉంది. తాజా రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వస్తాయని GST కౌన్సిల్ ప్రకటించింది. అలాగే స్థానిక అధికారిక యంత్రాంగం విద్యుత్తు బస్సులను అద్దెకు తీసుకున్నట్లయితే వాటిపై GSTని మినహాయిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం బడ్జెట్ ప్రవేపెట్టిన తర్వాత GST కౌన్సిల్ భేటీ కావడం ఇదే మొదటి సారి.