సరికొత్తచరిత్రకు శ్రీకారంచుట్టిన జగన్…


జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చరిత్ర సృష్టించారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాకుండానే ఏకంగా 20 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవటం నిజంగా చరిత్రనే చెప్పుకోవాలి. ఈనెల 12వ తేదీన మొదలైన బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం అందరికీ తెలిసిందే. మధ్యలో శని, ఆదివారాలు తీసేస్తే ఇప్పటి వరకూ 14 బిల్లులను అధికారపార్టీ ప్రవేశపెట్టింది.

ఈనెల 31వ తేదీతో బడ్జెట్ సమావేశాలు పూర్తవుతాయి. అంటే ఇంకా మూడు రోజులు సమావేశాలు జరుగుతాయి. ఈ మూడు రోజుల్లో మరో 6 బిల్లులను ప్రవేశపెట్టటానికి అధికార పార్టీ రెడీ అవుతోంది. అంటే మొత్తం మీద బడ్జెట్ సెషన్లో 20 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకున్న ఘటన గతంలో లేదనే చెప్పాలి.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్లో ప్రధానంగా బిసిలకు శాస్వత కమీషన్ ఏర్పాటు, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 రిజర్వేషన్, బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి వర్గాలకు నామినేటెడ్ వర్కుల్లో 50 శాతం కేటాయింపు, ఫ్యాక్టరీలు, సంస్ధల్లో స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా రిజర్వేషన్ లాంటి అనేక కీలకమైన బిల్లులున్నాయి. మిగిలిన మూడు రోజుల్లో ప్రవేశపెట్టబోయే ఆరు బిల్లుల సంగతి మాత్రం ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఏదేమైనా ప్రభుత్వం ఏర్పడిని రెండు నెలల్లోనే 20 బిల్లులు ప్రవేశపెట్టటమంటే మామూలు విషయం కాదు.

#జయహోజగన్_జోహార్_వైయస్ఆర్ ???

About The Author