రైల్లో గుండెపోటుతో రచయిత్రి కేబీ లక్ష్మి మృతి…
హైదరాబాద్ :-ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి (70) కన్నుమూశారు. తమిళనాడులోని అరక్కోణం వెళ్లిన ఆమె.. తిరిగి సోమవారం ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైల్లో కాచిగూడకు వస్తుండగా మార్గమధ్యంలో ఏపీలోని రేణిగుంట వద్ద గుండెపోటుకు గురయ్యారు. తోటి ప్రయాణికులు గమనించగా.. అప్పటికే మృతిచెందారు. రేణిగుంట రైల్వేస్టేషన్ లో జీఆర్పీ పోలీసులు ఆమె భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగించారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన కేబీ లక్ష్మి 2003లో నంది అవార్డు అందుకున్నారు. ‘మనసున మనసై..’, ‘జూకా మల్లి’ వంటి కథా సంపుటిలు, ‘గమనం’ వంటి కవితా సంపుటిలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. తెలంగాణ మాండలికంలో ఎన్నో కవితలు రాశారు. ఇల్లెందుల సరస్వతీ దేవి నవాలా రచనపై ఆమె డాక్టరేట్చేశారు. జర్నలిస్టుగా కూడా పనిచేశారు.