మాట తప్పే అలవాటు లేదని మళ్లీ నిరూపించిన సీఎం జగన్…
మాట ఇస్తే తప్పే అలవాటు లేదని తరచూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటుంటారు. చేయ గలిగేదే చెబుతానని కూడా ఆయన అంటుంటారు. ఇప్పుడు జగన్ అదే పని చేస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటను తూచా తప్పకుండా అమలు చేయబోతున్నారు. ఇంతకీ ఏ విషయం అంటారా..?
అదే మద్యపాన నిషేధం అంశం. రాష్ట్రంలో విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. బెల్టు షాపులు తీసేస్తానన్నారు. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మద్యం దొరికే పరిస్థితి లేకుండా చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
అందులో భాగంగా.. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ఏడాది 880 మద్యం షాపులను తగ్గిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4380 మద్యం షాపులు ఉన్నాయి.దశల వారీగా మద్య నిషేధం అమల్లో భాగంగా మొదటి విడతలో 20 శాతం దుకాణాల్ని తగ్గించాలని జగన్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌తో షాపులకు ఇచ్చిన లైసెన్సు రెన్యువల్ గడువు ముగుస్తుంది