వానరం విద్యార్థిలా..ఓ అల్లరి పిల్లాడిలా!


కర్నూలు: -ఆ కొండముచ్చు రోజూ బడికి వస్తుంది. శ్రద్ధగా పాఠాలు వింటుంది. విద్యార్థులతో కలిసి ఆడుతుంది. అంతెందుకు వారు చేసే పనులన్నీ ఈ వానరం చేస్తుంది. ఇంతకీ ఏంటీ కొండముచ్చు కథ.. ఎక్కడ జరిగిందీ ఆసక్తికర ఘటన. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులతో పాటు రోజూ ఓ కొండముచ్చు వస్తుంటుంది. సమీపంలోని కొండల్లో నివసించే ఈ వానరం కొన్నిసార్లు రోజంతా బడిలోనే గడుపుతుంది. కనీసం ఏదో ఒకపూట వచ్చి ‘అటెండెన్స్‌’ వేసుకుంటుంది. మీ అందరికీ నేనే లీడర్‌ అన్నట్టు ఫోజులు కూడా కొడుతుంది. కొద్ది రోజుల్లోనే వారికి స్నేహితుడిలా మారిపోయింది. పాఠశాలకు వచ్చింది మొదలు పిల్లలతో ఆడే ఆటలు వారికి భలే సరదాగా అనిపిస్తుంటాయి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉంటే మాత్రం గోల చేయకుండా పాఠాలు వింటూ గడుపుతుంది.

ఆ బాలికంటే ఎంతో ఇష్టమట..!
ఈ కొండముచ్చుకు పాఠశాలలో ఓ బాలిక అంటే చాలా ఇష్టం. ఎక్కువ సేపు ఆ బాలికతోనే ఆడుతుంటుంది. ఆమె తలపై కూర్చొని పాఠశాలంతా తిప్పించుకుంటుంది. పేలు చూస్తుంది. అంతబాగా ఆడిస్తున్న స్నేహితుడిని వదిలి వెళ

About The Author