బ్రిటిష్ గడ్డమీద తెలుగువారి కీర్తిని రెపరెపలాడిస్తున్న వింజమూరి రాగసుధ గారు…


వింజమూరి రాగసుధ గారు ప్రముఖ రచయిత్రి మరియు నాట్యకారిణి. ఆమె వ్రాసిన పుస్తకాలు బ్రిటిష్ గడ్డమీద తెలుగువారి కీర్తి రెపరెపలాడిస్తున్నాయి .

ఆమె పర్యాటకరంగం బోధకురాలిగా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఖండాలు దాటినా తెలుగువారి ఘనతను వెలికితీసే ప్రయ్నతంలోనే నిమగ్నమయ్యారు.

బ్రిటిష్‌ లైబ్రరీలో తెలుగుపుస్తకాల జాబితాను పెంచేందుకు నిరుపయోగంగా ఉన్న తాళపత్రగ్రంథాలను పుస్తకాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.

కామన్‌వెల్త్‌ జర్నలిస్ట్‌గా సామాజిక అంశాలపై రచనలు చేస్తూ మహిళల విజయాలకు ఎల్లలు లేవని చాటుతున్నారు.

త్యాగరాయగానసభ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌ వరకు ఆమె నాట్యానికి వేదికలైనాయి.

About The Author