వృద్ధులకు ఈ హోటల్‌లో ఉచితం…


నిరుపేదలైన వయోవృద్ధులు ఈ హోటల్‌కు వెళితే ఆప్యాయంగా పలకరిస్తారు. ఉచితంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు. కేరళలోని కోజికోడ్‌ జిల్లాలో మారుమూల గ్రామమైన కుట్టియాడిలో కండతిల్‌ అనే హోటల్‌ను నిర్వహిస్తున్న బాబు ఇలా ఆదర్శంగా నిలుస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన వృద్ధుల నుంచి పైసా కూడా తీసుకోరు. అంతేకాదు.. హోటల్‌లో విక్రయించే ఇతర తినుబండారాలు కూడా ఉచితంగా అందిస్తుంటారు. ఎవరైనా పైకం ఇవ్వడానికి ప్రయత్నించినా బాబు వాటిని తిరస్కరిస్తారు. వయోవృద్ధులకు కడుపు నింపడంలోనే తనకు ఆనందమని చెబుతుంటారు. ఐదేళ్ల క్రితం గ్రామంలో హోటల్‌ ప్రారంభించిన నాటి నుంచి వృద్ధులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు బాబు.

About The Author