“కాసర కాయలు” వీటి రుచే వేరు…


రాయలసీమలోని కడప,కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన కాయగూర ఇది.

కాకరకాయ లానే ఇది కూడ చేదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు.

—>వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడితో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న రొట్టెల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు.

—>నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు అప్పుడు నూనెలో మజ్జిగ మిరపకాయలులాగ వేయించుకొని భోజనంలో తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక నిలువ వుంటాయి చెడిపోకుండా…!!

అదో రకపు చేదే గాని.. ఆ చేదు కూడ చాలా రుచిగా వుంటుంది… హెల్త్ కి చాలా మంచిది దొరికినప్పుడు మాత్రం కొనుక్కొని తప్పకుండా ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి.

నేనైతే లెక్కలేనన్ని సార్లు జొన్నరొట్టెతో తిన్నా… మరి మీరు???

About The Author