తొలిసారి ఎవరింటికి వెళ్లినా కుడిపాదమే మోపండి..!!


సొంతిళ్లైనా సరే ఎవరింటికి తొలిసారి వెళ్లినా కుడిపాదమే మోపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు

. ఈ కారణంగానే వరుడుతో కలిసి నూతన వధువు తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తోంది. ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు … ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు
.
కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు … సమస్యలు కలిసి కాపురం చేస్తాయని అంటూ వుంటారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది.

సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట.

కాబట్టి ఎక్కడైతే సఖ్యతను … సంతోషాన్ని … సంపదను ఆశిస్తామో, అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

About The Author