ఈ కళ్లు ఎన్నో బాధలు చూశాయి, ఎన్నో మరణాలు చూశాయి…

ఈ కళ్లు ఎన్నో బాధలు చూశాయి, ఎన్నో మరణాలు చూశాయి, రక్తపాతాన్ని చూశాయి, వలసలు చూశాయి. కానీ ఇలాంటి రోజు మళ్లీ ఒకటి చూస్తాయని అసలు అనుకోలేదు.”
కాశ్మీరీ పండిట్ అశోక్ భాన్

ఈ మాటలన్నది 58 సంవత్సరాల వయసున్న కశ్మీరీ పండిట్ అశోక్ భాన్. ఈయన 1990 జనవరి 19న అన్నీ వదిలి, కశ్మీర్ నుంచి జమ్మూకు శరణార్థిగా వెళ్లిపోయారు.
మమ్మల్ని పాకిస్తాన్‌లో కలిపేయండి అని మసీదుల నుంచి ఆ రాత్రి వచ్చిన నినాదాలను ఉద్వేగంతో గుర్తుచేసుకున్నారు అశోక్ భాన్.

జనవరి 19 నాటి ఆ సాయంత్రం గుర్తొస్తే నాకు ఇప్పటికీ వణుకొస్తుంది. నేను అప్పుడు ఆసుపత్రిలో ఉన్నాను. మసీదుల నుంచి నినాదాలు వినపడగానే నా కాళ్లు వణికాయి. అప్పుడు జరిగినదాన్ని నేను మాటల్లో చెప్పలే
కశ్మీరీ పండిట్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్ని వైపుల నుంచి నినాదాలు వెల్లువెత్తాయి. దీంతో నా మనసులో ఒకటే ఆందోళన… ఇప్పుడు నా కుటుంబం అంతా ఎక్కడికి వెళ్లాలి? ఏం తినాలి? మా ఇళ్లు ఏమైపోతాయి?” అని భాన్ ఆనాటి ఘటనలను వివరించారు.
అశోక్ భాన్భాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి దిల్లీలో నివసిస్తున్నారు.

నేను కశ్మీర్‌కు తిరిగి వెళ్లాలనుకుంటున్నా. నేను కశ్మీర్ వదిలి వచ్చేనాటికి నా వయసు 27ఏళ్లు. ఇప్పుడు 60కి చేరువయ్యాను. ఇప్పటికీ మా ఇల్లు కశ్మీర్‌లోనే ఉంది. కశ్మీర్ నా మాతృభూమి. ఏదో రోజు మేం కశ్మీర్‌కు తిరిగివెళ్తాం అనుకుంటూనే 30 ఏళ్లు గడిచిపోయాయి. ఈ రోజు మాకు పండగ లాంటిది. మా కల ఇన్నాళ్లకు నెరవేరింది” అని భాన్ అన్నారు.

About The Author