ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లికి వెళ్లనున్నారు.
ఉదయం 9.30 గంటలకు సీఎం జగన్ ఢిల్లి బయల్దేరనున్నారు. ఢిల్లిలో రెండు రోజుల పాటు జగన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను జగన్ కలవనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీకానున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతిని జగన్ కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును సీఎం కలవనున్నారు. రేపు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు. భేటీల్లో సీఎం జగన్ పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. రెవెన్యూ లోటు, పోలవరం టెండర్ల రద్దు, పీపీఏలపై జగన్ చర్చించనున్నారు. రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోడీకి జగన్ నివేదిక ఇవ్వనున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు ఢిల్లి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు తిరిగి అమరావతికి జగన్ చేరుకోనున్నారు.
విభజనాంశాలపై ప్రధానితో భేటీ కానున్న సీఎం జగన్
ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయమై మాట్లాడేందుకు సీఎం జగన్ ఆగస్టు 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం ఆగస్టు 6న ఢిల్లీకి బయలుదేరి వెళ్లే ఆయన…. అదేరోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. బుధవారం ఆగస్టు 7న రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్ సమావేశం అవుతారు. పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి ఒక నివేదిక సమర్పించనున్నారు.
గత ప్రభుత్వం హయాంలో జరిగిన పోలవరం టెండర్లు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలు వివాదాస్పదమైనందునవాటిని సమీక్షించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలను కూడా జగన్ ప్రధానికి వివరించనున్నారు.