దేశవ్యాప్తంగా రేషన్ కార్డులు వాడుకునే పోర్టబిలిటీ


దేశవ్యాప్తంగా రేషన్ కార్డులను వాడుకునే విదంగా కేంద్రం పోర్టబిలిటిని తీసుకు వస్తోంది. ఆహార భద్రత కార్డులు ఉన్నవారికి ఈప్రయోజనం కలిగించనున్నారు. ముందుగా నాలుగు రాష్ట్రాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయతలపెట్టారు.

సరిహద్దు రాష్ర్టాలుగా ఉన్న మహారాష్ట్ర-గుజరాత్‌ను
ఒక యూనిట్‌గా, ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణలను మరో యూనిట్‌గా ఎంచుకుంది. జంట రాష్ట్రాల్లో ఉన్న కార్డుదారులు రెండు రాష్ర్టాల్లో ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చు. ఈ నెల 15లోపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయించింది.

ఇందుకోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని కార్డులను పరీక్షించారు. తెలంగాణ కార్డులను ఆంధ్ర ఈపోస్‌ యంత్రాల్లో పరీక్షించి, సక్రమంగానే పని చేస్తున్నాయని ధృవీకరించుకున్న తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.

About The Author