జమ్మూ కశ్మీర్ అంటే కల్లోల రాష్ట్రంగానే దేశ ప్రజలకు తెలుసు..


జమ్మూ కశ్మీర్ అంటే కల్లోల రాష్ట్రంగానే దేశ ప్రజలకు తెలుసు.. ఆర్టికల్ 370 ఏమిటి?, అసలు సమస్య అంటే ఏమిటో తెలియని వారే ఎక్కువ.. జమ్మూ కశ్మీర్ విషయంలో దేశ ప్రజలకు అవగాహన తీసుకురావడంలో చాలా ఏళ్లుగా కృషి చేస్తున్న మహనీయులు అరుణ్ కుమార్ జీ..
జమ్మూ కశ్మీర్ అధ్యయన కేంద్రం వ్యవస్థాపక సంయోజకులుగా దేశ ప్రజలను చైతన్య పరిచే ఎన్నో ఉపన్యాసాలు, సదస్సులు నిర్వహించారు అరుణ్ జీ.. ఈ సంస్థకు సేవ చేసే అవకాశం కలగడం మా అదృష్టంగా భావిస్తుంటాం.. జమ్మూ కశ్మీర్ కు ఎంతో నష్టం కలిగిస్తున్న ఆర్టికల్ 370 రద్దు విషయంలో దేశ ప్రజల అభిమతాన్ని ప్రభావితం చేయడంలో వారి పాత్ర ఎంతో ఉంది.. 2015 జనవరి 24, 25 తేదీల్లో రాయపూర్ లో జరిగిన జేకేఎస్సీ జాతీయ వార్షిక సదస్సులో అరుణ్ జీ ఉపన్యాసంలోని కీలక అంశాలు ఇప్పటికీ నా చెవిలో మార్మోగుతుంటాయి..
” జమ్మూ కశ్మీర్ సమస్య ఈ దేశ ప్రజలందరిదీ.. శరీరంలో ఏ భాగానికి హాని కలిగినా మొత్తం దేహంపై ప్రభావం చూపినట్లే కశ్మీర్ సమస్య కూడా దేశ భద్రతను ప్రభావితం చేస్తుంది.. భారత దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్ర విలీనం విషయంలో ఎలాంటి సమస్య లేదు.. ఇది కేవలం బ్రిటిష్ వారి కుట్రకు తోడు ఢిల్లీ కేంద్రంగా సృష్టించిన సమస్యే.. జమ్మూ కశ్మీర్ సమస్యకు మూలం సరైన సమాచారం అందుబాటులో లేకపోవడమే.. ఇందుకు ప్రధాన బాధ్యత రాజకీయ నాయకులకన్నా విద్యావంతులు, మీడియాదే.. భారత్ లోని అన్ని రాష్ట్రాల మాదిరిగానే కశ్మీర్ దేశంలో సంపూర్ణ అంతర్ భాగం.. ఈ విషయంలో దేశ ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.. జమ్మూ కశ్మీర్ గురుంచి ముందుగా తెలుసుకోండి, అర్థం చేసుకోండి, కలుపుకోండి.. ఈ దిశగా మనందరం పని చేద్దాం..’’ – అరుణ్ కుమార్

About The Author