ఈ జేమ్స్ దేవుడు… అతడి రక్తము అమృతం …


జేమ్స్‌ హ్యారీసన్‌ ఒక రక్త దాత .. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు.. ఆయన రక్తం మాత్రమే విలువైనది.. ఎందుకో తెలుసా ..? అతనిది మామూలు రక్తం కాదట, ఆయన రక్తంలోని ప్లాస్మా నుంచి వ్యాధి నిరోధక ఇంజెక్షన్‌ తయారవుతుందట. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హ్యారీసన్‌ రక్తదానం ద్వారా వైద్యులు ఇప్పటికీ 2.4 మిలియన్ల మంది గర్భస్థ శిశువులను కాపాడారట.
అరవై ఏళ్ల హ్యారీసన్‌ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వారాలకు ఒకసారి రక్తాన్ని ఇస్తూ వస్తున్నారు. తల్లి గర్భంలో ఉండే శిశువుల్లో రక్త కణాలను దెబ్బతీసే కొన్ని జీవులు ఉంటాయి. అవి క్రమంగా వ్యాధిలా మారి బిడ్డ ప్రాణానికే ప్రమాదంగా మారేలా చేస్తాయి. జేమ్స్‌ రక్తం అలాంటి వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీంతో అతని రక్తం ద్వారా వైద్యులు యాంటీ-డీ ఇంజెక్షన్‌ తయారు చేసి శిశువులను బతికిస్తున్నారు. వైద్యులు ఇంజెక్షన్‌ తయారీ కోసం అతని రక్తం నుంచి ప్లాస్మా తీసుకుని తిరిగి అతడికి ఎర్రరక్త కణాలను ఎక్కిస్తున్నారు. ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌ సంస్థ ప్రతినిధి ఫాల్కెన్‌మైర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జేమ్స్‌ రక్తం ఎంతో అసాధారణమైనది అని అన్నారు. అతడి రక్తం మెడిసిన్‌ తయారు చేయడంలో ఉపయోగపడుతుందని అన్నారు. శిశువులను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి తోడ్పడుతుందన్నారు. ఆస్ట్రేలియాలో దాదాపు 17% పైగా ఆపదలో ఉన్న మహిళలకు జేమ్స్‌ సాయం చేసి రక్షించాడని తెలిపారు.

About The Author