ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు జన్మదిన శుభాకాంక్షలు…


ఒకనాటి సూపర్ స్టార్ వారసుడు ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఘట్టమనేని రాకుమారుడు, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు. సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా కొంచెం మంది డీసెంట్ హీరోస్ లో తనే ప్రముఖుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు.మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ప్రతి మనిషికి ఇయర్ పెరిగే కొద్దీ వయసు పెరుగుతుంటే ఈయనకి మాత్రం వయసు తగ్గుతూ వస్తుంది అనటం లో ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ 16 ఏళ్ళు దాటని యంగ్ హీరో మహేష్ .

ఎవడుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యిద్దో వాడే పండుగాడు… అని టాలీవుడ్ సినిమాల ట్రెండ్ ను తన సైన్ తో సెట్ చేసిన హీరో మహేష్ బాబు. తన సిినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. టక్కరిదొంగ,నిజం, నాని, 1.ఈ కోవకు చెందినవే.
మూస సినిమాలు కాకుండా తండ్రిలానే డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారు. సినిమా హిట్ flap తో సంబంధము లేకుండా తన యాక్టింగ్ తో నెంబర్ రేస్ లో లేనంటూనే నెంబర్ 1 గా కొనసాగుతున్న మన ఈతరం సినీ మహర్షి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

About The Author