హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్…


ఉన్నత విలువలతో కూడిన ఎన్నో గొప్ప చిత్రాలు తీసిన దర్శకుడు శ్రీ కె. విశ్వనాథ్ ఆధ్వర్యంలో సమాజానికి మంచి సందేశం అందించే మరో చిత్రం రావాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. విశ్వనాథ్ దర్శకుడయితే, నిర్మాణ పరమైన విషయాలు తాను చూసుకుంటానని మాటిచ్చారు.

హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని విశ్వనాథ్ నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వెళ్లారు. విశ్వనాథ్, ఆయన భార్య శ్రీమతి జయలక్ష్మి, కొడుకు శ్రీ రవీంద్రనాథ్, కోడలు శ్రీమతి గౌరి, దర్శకుడు శ్రీ ఎన్. శంకర్ తదితరులు స్వాగతం పలికారు. విశ్వనాథ్ దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలతో సన్మానించారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమంత్రిని సన్మానించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ శేరి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరులున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, విశ్వనాథ్ మధ్య సినిమాలు, భాష, సాహిత్యం తదితర అంశాలపై గంటకు పైగా ఆసక్తికరమైన చర్చ జరిగింది.

‘‘నేను మీ అభిమానిని. చిన్నప్పటి నుంచీ మీ సినిమాలంటే చాలా ఇష్టం. మీరు తీసిన ప్రతీ సినిమా చూశా. శంకరాభరణం అయితే 25 సార్లకు పైగా చూసి ఉంటా. దాదాపు అన్ని సినిమాలు అలాగే చూశా. సినిమా చూసిన ప్రతీసారి మిమ్మల్ని ఓ సారి కలవాలనిపించేది. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది. మీరు తీసే ప్రతీ సినిమా ఓ కావ్యంలాగా ఉంటుంది. మీరు సినిమాలను తపస్సుతో తీస్తారు. అందులో వాడే భాషగానీ, పాటలు గానీ, కళాకారుల ఎంపిక గానీ, సన్నివేశాల చిత్రీకరణ గానీ, సంభాషణలు గానీ ప్రతీదీ గొప్పగా ఉంటాయి. కుటుంబ మంతా కూర్చుని చూసేలా ఉంటాయి. అందుకే ఇప్పటికీ వీలు దొరికితే మీ సినిమాలు చూస్తాను. మీపై ఉన్న అభిమానమే నన్ను మీ దగ్గరకి తీసుకొచ్చింది. మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ సినిమాలు రాక పదేళ్లయింది. సందేశాత్మక, గొప్ప సినిమాలు ఈ మధ్య రావడం లేదు. మీరు మళ్ళీ సినిమా తీయాలి. సహాయకుల ద్వారా మీ మార్గదర్శకత్వంలో సినిమా తీద్దామంటే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడానికి నేను సిద్ధం. దయచేసి దీనికోసం ప్రణాళిక సిద్ధం చేయండి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

‘‘మీరు అడుగు పెట్టడంతో మా ఇల్లు పావనమైంది. మీరే స్వయంగా మా ఇంటికి రావడం మా అదృష్టం. రాత్రి మీరు నాతో ఫోన్లో మాట్లాడి, ఇంటికి వస్తున్నానని చెబితే, ఎవరో గొంతు మార్చి మాట్లాడుతున్నారని అనుకున్నాను. మీరే మాట్లాడారని తేల్చుకున్నాక రాత్రి 12 గంటల వరకు నిద్ర పట్టలేదు. మీరు చేసే పనులను, ప్రజల కోసం తపించే మీ తత్వాన్ని టీవీల్లో, పత్రికల్లో చూస్తున్నాను. నేరుగా చూడడం ఇదే మొదటి సారి. చాలా సంతోషంగా ఉంది. గతంలో మీలాగే ఒకసారి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంజిఆర్ మాట్లాడారు. మళ్లీ మీ అంతటి వారు మా ఇంటికి రావడం నిజంగా సంతోషంగా ఉంది’’ అని విశ్వనాథ్ అన్నారు.
తన ఆరోగ్యం గురించి కేసీఆర్ వాకబు చేసిన సందర్బంగా విశ్వనాథ్ ఆసక్తికరమైన విషయం చెప్పారు.

‘‘ఆరోగ్యం బాగానే ఉంది. కానీ మోకాళ్ల నొప్పులున్నాయి. ఆపరేషన్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. కానీ నాకు ఆపరేషన్ అంటే భయం. అసలు హాస్పిటల్ అంటేనే భయం. నా సినిమాల్లో కూడా ఎక్కడా ఆసుపత్రి సీన్లు పెట్టను. రక్తం అంటే భయం. ఇక నేనేమి ఆపరేషన్ చేయించుకుంటాను. ఇలాగే గడిపేస్తా’’ అని విశ్వనాథ్ చెప్పారు.

‘‘మీకు తెలుగు భాషపైనా, సాహిత్యంపైనా మంచి పట్టుంది. ప్రపంచ తెలుగు మహాసభలను గొప్పగా నిర్వహించారు. మీరు చక్కగా మాట్లాడతారు. మంచి కళాభిమాని కూడా’’ అంటూ విశ్వనాథ్ సిఎంను అభినందించారు. సాహిత్యాభిలాష ఎలా పుట్టిందని విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు, చిన్నప్పటి నుంచి తన గురువుల సాంగత్యం గురించి కేసీఆర్ వివరించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పగా కట్టారు. రైతుల కష్టాలు తీరుతాయి. కాళేశ్వరం నీళ్లు వస్తున్నప్పుడు మీ కళ్లల్లో ఎంతో ఆనందం చూశాను. నిజంగా చాలా గొప్ప ప్రాజెక్టు. రైతులకు సాగునీరు ఇవ్వాలనే మీ తపనంతా విజయవంతం అవుతుంది’’ అని విశ్వనాథ్ భార్య జయలక్ష్మి ముఖ్యమంత్రితో చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో పుష్కలమైన నీళ్లున్నాయని, వాటిని రెండు రాష్ట్రాలు మంచిగా వాడుకుంటే రెండు రాష్ట్రాల రైతులకు మేలు కలుగుతుందని, ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అదే పనిలో ఉన్నాయని కేసీఆర్ చెప్పారు.

మీరు చాలా కష్టపడి ప్రాజెక్టులు కడుతున్నారు, అయినా విమర్శలు తప్పడం లేదు, ఎలా భరిస్తున్నారు అని సిఎంను విశ్వానాథ్ అడిగారు. ‘‘రాజకీయాల్లో అన్నీ అలవాటైపోయాయి. తప్పదు కూడా. ప్రజల కోసం పనిచేస్తున్నామనే ఉద్దేశ్యంతో అవన్నీ పెద్దగా పట్టించుకోవడం లేదు. పని చేసుకుంటూ పోతున్నాను’’ అని కేసీఆర్ సమాధానమిచ్చారు. ప్రజల కోసం చేసే పనికి దైవ కృప ఉంటుంది. మీకు కూడా ఉంది అని విశ్వనాథ్ దీవించారు.

హైదరాబాద్ లో సినిమా పరిశ్రమ ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా త్వరలోనే సినిమా పరిశ్రమ కోసం కొత్త పాలసీ తెస్తుంది అని కేసీఆర్ విశ్వనాథ్ కు చెప్పారు.

Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao desired that well known director and Dadasaheb Phalke awardee Sri K. Vishwanath who made several classic movies with lot of good values in Telugu, should make another classic film, which will be useful to the society at large. The CM said he is ready to produce the film if Sri Viswanath decides to direct it. CM KCR went to the residence of Sri Vishwanath on Sunday at the Film Nagar here. Sri Viswanath, his wife Mrs Jayalakshmi, his son Sri Ravindranath, Daughter in law Mrs Gowri, Director Sri N Shankar have accorded a warm welcome to the CM. Sri KCR has felicitated Sri Viswanath and his wife with shawls. Sri Viswanath’s family members have also felicitated the CM. Along with the CM, Minister Sri Vemula Prashanth Reddy, Whip Sri Palla Rajeshwar Reddy, MLC Sri Seri Subhash Reddy, TRS general secretary Sri Sravankumar Reddy and others visited.

In the meeting interesting discussions took place on films, Telugu language and literature between the CM and Sri Viswanath for about half an hour.

“I am your fan. I loved your films since my childhood. I saw each and every film that you have made. I watched Shankarabharanam film for about 25 times. I saw your film repeatedly. Every time I watched your film I felt like meeting you personally. My desire is fulfilled today. Each film that you make is like a poem. You make films with dedication and like Tapasya. Every department, whether it is selecting the actors, dialogues, language that used, every scene, songs, picturisation, art excel in all aspects. Your films can be watched by the entire family sitting together. This is precisely the reason why I watch your films even today whenever I find the time. My affection towards you has brought me here. I think I am fortunate to have met you personally and talked to you. You have not made any film for the past ten years. Now a days we are not getting good films which are message oriented. You have to make a film again. If you agree to make the film with the help of your assistants, I am reedy to take care of the production part of it. Please make a plan for this,” the CM requested Sri Vishwanath.

“With your visit our house became pious. You, yourself are visiting our house, is our good fortune. When you called me up yesterday night and said you will be visiting my house, I thought that somebody mimicking your voice. But later when I found that you have spoken to me I did not sleep till 12 midnight. I have been watching your good work and your basic nature of working hard for the people I came to know through reports in newspapers on TVs. I am personally meeting you for the first time. Once Tamil Nadu CM Sri MGR came to my house and now you have graced my house for which I am happy,” Sri Vishwanath said.

When the CM enquired about his health, Sri Vishwanath said,” My health is fine. But I have knee joints pain. Doctors say they will perform the replacement operation but I am scared of operation. I am scared of hospitals. Even in my films I never put Hospital scenes. I am scared of watching blood. Then how will I undergo operation? I will continue and manage like this,” Sri Viswanath said.

Sri Vishwanath also complimented the CM by saying,” You have a wonderful grip over the Telugu language and literature. You have organised the World Telugu Conference on a grand scale. You are a great orator and have liking over the Arts. On asked from when the CM got the taste of Telugu language and literature, Sri KCR replied that he got it from the company of his great teachers.

Speaking to the CM, Sri Vishwanath’s wife Mrs Jayalakshmi said,” You have built Kaleshwaram project on a largescale. Farmers’ problems will be solved with this. I could see happiness in your eyes when water coming from the Kaleshwaram. I am sure your aim of giving irrigation water in the state will be successful.”

To this, the CM said there is availability of water in both the Krishna and Godavari rivers, both the Telugu states should utilise them for the welfare of farmers. Both the States government are on the job, he said.

Sri Vishwanath asked on how the CM was able to withstand the criticism despite the fact that he was constructing the projects with lot of hard work. To this, the CM replied,” These things have become habitual for me in politics. I am not taking any conginsance of the baseless criticism as I am working with the aim of bettering the lives of people. Sri Vishwanath blessed the CM and said that for all the good work undertaken for people’s welfare God will have his blessings to it.

Sri KCR said that there is a lot scope for the film industry develop further in Hyderabad and added that the government would come out with a new policy on the film industry.

About The Author