స్వల్పకాలిక పంట ధనియాల సాగు…


ప్రస్తుత నీటి ఎద్దడి పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక పంటల వైపుమొగ్గు చూపాలి. ఇందుకు ధనియాల సాగు ఉత్తమం. ఈ పంటను ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఏడాది అంతా ఆదాయ మార్గంగా ఉంటుంది.

ధనియాల పంట ఆకులను, గింజలను సుగంధ ద్రవ్యంగా వాడుతారు. స్వల్పకాలిక పంట కావడం, విత్తనాలతో సాగు చేసే సౌలభ్యం ఉండటంతో పాటు, మండలాలు, పట్టణాల్లో కొత్తిమీరకు ఎప్పడూ గిరాకీ ఉంటుంది. దీంతో ఈ పంట సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. చీడపీడల సమస్య తక్కువ. సాగు నీటి ఆధారంగా దిగుబడులు పెరుగుతాయి. ధనియాల పంటకైతే రకాన్ని బట్టి సాగు కాలం మారుతుంది. కొత్తమీర కోసం ఒక నెలలోనే దిగుబడి చేతికి వస్తుంది.

About The Author