పాకిస్థాన్ కు దీటుగా జవాబు ఇచ్చే క్రమంలో అమరుడైనా భారత జవాను…


లాల్ సందీప్ కు కన్నీటి వీడ్కోలు
ఆర్మీ హెలికాప్టర్ లో స్వగ్రామానికి
అంత్యక్రియలకు ముఖ్యమంత్రి
జోహర్ అంటు జనం జేజేలు
పాకిస్థాన్ కు దీటుగా జవాబు ఇచ్చే క్రమంలో అమరుడైనా భారత జవాను లాల్ సందీప్ థాపా అంత్యక్రియలు ప్రజల జేజేల మధ్య ముగిసాయి. గత శనివారం ఉదయం జమ్మూకాశ్మీర్ నౌషెరా సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు దిగిన పాక్ కు ధీటైన జవాబు ఇచ్చే క్రమంలో సందీప్ థాపా మృతి చెందిన విషయం తెలిసిందే.

● కుప్పకూలిన కుటుంబం ●
సందీప్ థాపా మృతదేహాని ఆర్మీ హెలికాప్టర్ ద్వారా జాలీగ్రాంట్ విమాన శ్రయానికి…తిరిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా స్వగ్రామమైన రాజ్ వాలా పౌండ్వాలాకు ( డెహ్రాడూన్ జిల్లా ) చేర్చారు. జాతీయ జెండాతో కప్పబడిన సందీప్ మృతదేహాని చూడగానే తల్లి రాద దేవీ, భార్య నిషా థాపాలు కుప్పకూలి పోయారు.

● దేశ సేవలోనే కుటుంబ ●
తండ్రి భగవాన్ థాపా రిటైర్డ్ జావాన్. అతను తన ముగ్గురు కుమారులను దేశ సేవలో పంపించారు. ఇంటికి పెద్దవాడైన సందీప్ 2004లో తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని సైన్యంలో చేరాడు. తన కుమారుడు దేశం కోసం అమరుడైనందుకూ గర్వంగా ఉందని మిడియాతో తండ్రి భగవాన్ సింగ్ పేర్కొన్నారు. అంత్యక్రియలకు డెహ్రాడూన్ జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. రాజావాల గ్రామం కన్నీరుమున్నీరైయిందీ.

● కదిలి వచ్చిన యంత్రాంగం ●
భారత్ మాతకే జై… వందేమాతరం… నినాదాల మధ్య అంతిమ యాత్ర సాగింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ తో పాటు, ఆర్మి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, వివిధ పార్టీల నేతలు దహన సంస్కరాలలో పాల్గొన్నారు. సందీప్ కుమారుడు మూడున్నర ఏళ్ల చిన్నారి కావడంతో తండ్రి భగవాన్ సింగ్ చితికి నిప్పంటించారు.

About The Author