ఎవరైనా నెయ్యి తినవద్దని చెప్పితే వాళ్ళని హేళనగా చూడండి…
నెయ్యి తెలిసినది. …..తెలియనిది…
ఎవరైనా నెయ్యి తినవద్దని చెప్పితే వాళ్ళని హేళనగా చూడండి.
నెయ్యి అనేది ముఖ్యమైన దినుసు అని సిధ్ధుల మాట. దాని ఔషధ గుణాలను ఈ రోజు ఉన్న పరిజ్ఞానం కంటే ఎంతో ముందు పరిశోధించారు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన నెయ్యిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
పాలు బాగా కాచినేని,చల్లారక కాస్త పెరుగు తోడు పెడితే ఆరు ఎనిమిది గంటలలో పెరుగు తయారౌతుంది.
ఈ పెరుగులో కాసిని నీళ్లు పోసి కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. దాన్ని ఒక గిన్నెలో వేసి కాస్తే అది కరుగుతుంది. అందులో ములగాకు కాస్త వేస్తే చక్కగా పొంగుతుంది. చక్కటి సువాసన వస్తుంది. పూర్తిగా కరిగాక, దింపి వడకట్టి జాగ్రత్త చేసుకోవాలి. ఈ రకంగా చేస్తే నెయ్యి ఎక్కువ కాలం పాడుగాకుండా ఉంటుంది. ఈ నెయ్యిలో ఔషధ గుణాలుఉన్నాయి.
రెండు వేల సంవత్సరాలు ముందే సిద్ధ ఆయుర్వేద చికిత్సలో నెయ్యి విరివిగా ఉపయోగించేవారు. ఔషధ గుణాలు కలిగిన అణువుల గోడలు పారదర్శకంగా ఉండడం వలన ఔషధాల తయారీలో నెయ్యి ఎక్కువగా వాడేవారు.
ఔషధం చెడిపోకుండా నెయ్యి ఒక ప్రిజర్వేటివ్ గా పని చేస్తుంది. నెయ్యి ఒక రసాయనం అని ఆయుర్వేదం చెబుతుంది. పూర్తి శరీర ఆరోగ్యాన్నిచ్చే గుణాలు నెయ్యిలో ఎన్నో ఉన్నాయి.
ఈ రకంగా నెయ్యి సిధ్ధ ఆయుర్వేద వైద్యులకు ఒక మంచి నేస్తంగా, తయారైన మందులను చెడిపోకుండా ఉండేందుకు బాగా సహాయకారిగా ఉంటుంది.
ఒక గరిటెడు నెయ్యిలో 14 గ్రాముల కొవ్వు శక్తి ఉంటుంది. జీర్ణ శక్తిని పెంపొందించే జఠరాగ్నిని నియంత్రించడం చేస్తుంది. మ్యూకస్ మెంమ్బ్రేన్ ను బల పరుస్తుంది.
నెయ్యిలో ఉప్పు, లాక్టోజ్ వంటివి లేవు. లాక్టోజ్ ఇన్టాలరెన్స్ (పాల పదార్థాలు పడక పోవడం) ఉన్న వారు నెయ్యి వాడుకోవచ్చు.
కాన్సర్, వైరస్ అనారోగ్యాలు కూడా నెయ్యితో కంట్రోల్ చేయవచ్చు.
నెయ్యిలో CLA – Conjulated Linoleic Acid ఉంది. ఇది ఊబ కాయం తగ్గిస్తుంది.
అలాగే ఒమేగా 3 ఆమ్లాలు నెయ్యిలో విరివిగా ఉన్నాయి. ఇది మెదడుకు చాలా మంచిది.
నెయ్యిలో Saturated fat – 65%
Mono – unsaturated fat – 32%
Linoleic – unsaturated fat -3%
ఇన్ని విలువలు ఉన్న నెయ్యిని ఏ రకంగా వాడుకోవచ్చో తెలుసుకుందాం.
“నెయ్యి కరిగించి, మజ్జిగ చిలికి వాడాలని సామెత”.
అంటే, నెయ్యిని కరిగించి, వేడి అన్నంలో కలుపుకుని తినాలి. దాని వలన దేహానికి చలువ చేస్తుంది.
దోశను నూనె బదులుగానెయ్యితో కాల్చండి. నేతితో పత్యం కూడా చేయవచ్చు.
మలబద్ధకం, వాతం, కఫంతో పాటు అనేక ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
శరీరానికి కాంతిని ఇస్తుంది.
కంటి నరాలు బల పడి కంటి చూపు బలపడుతుంది/మెరుగు పడుతుంది. శరీర పటుత్వం పెరుగుతుంది.
కొందరు ఎప్పుడూ అలసటతో శరీరంలో శక్తి లేకుండా ఉంటారు. కాస్త దూరం నడిచినా ఆయాసపడి పోతారు. వెంటనే కాళ్ళ నొప్పితో కూలబడిపోతారు. ఇటువంటి వారికి మధ్యాహ్నం భోజనంలో నెయ్యి వేసుకొని తింటే మంచిది.
విపరీతంగా ఉపవాసాలు ఉండే వారు, సమయానికి భోజనం చేయని వారూ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆమ్లాలతో అల్సర్ బారినపడి బాధ పడుతూ ఉంటారు.
నోటి పూతతో బాధ పడేవాళ్ళు, ఎక్కువగా కారం తినే వాళ్ళు, ఆల్కహాల్ తాగే వారు, మత్తు మందులకు అలవాటు పడ్డవాళ్ళు, ఒత్తిడి గలవారు, ఇలాంటి వారందరికీ కడుపులో అల్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
వీటి అన్నింటికీ నెయ్యి వాడకం ఎంతో మేలు చేస్తుంది