ఈ నెలలో పెళ్లి…కానీ దాని వలన ఆగిపోయింది
ఈమధ్యన ఓ ఇల్లు కొనుగోలు వివాదంలో దాడికి గురై తీవ్ర గాయాలపాలైన జబర్దస్త్ నటుడు వినోద్ కోలుకుంటున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితి గురించి, తన పెళ్లి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దాడి నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పిన ఆయన కొంచెం కొంచెంగా ఆరోగ్యం కుదుటపడుతోందని, కానీ వాళ్లు కొట్టిన దెబ్బలకు ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కళ్లపై బలంగా కొట్టడంతో ఒక కన్ను చూపు కనిపించడం లేదని మరో కన్నుతో మేనేజ్ చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు.గాయమైన కన్నుకు చూపు రావాలంటే మరికొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు వినోద్ పేర్కొన్నాడు. దాడి కారణంగా షూటింగ్స్‌కు దూరమయ్యానని త్వరలోనే మళ్లీ బిజీ అయిపోతానని చెప్పాడు.
తనపై దాడికి పాల్పడినవారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారని ఇంటి విషయంలో తనకు న్యాయం జరిగేవరకు చట్టపరంగా పోరాడుతూనే ఉంటానని అన్నాడు. అయితే గతంలో ఒకసారి వినోద్‌కు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నింగా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత సొంత అమ్మానాన్నలే కిడ్నాప్ చేశారని కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. పెళ్లి ఇష్టం లేకనే అప్పుడు అలా చేశాడని వార్తలు వచ్చాయి, ఈ సందర్భంగా మరో సారి పెళ్లి గురించి ప్రస్నించగా తనకు ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని, ఈ శ్రావణమాసంలో పెళ్లి పెట్టుకున్నామని అన్నాడు. కానీ దాడి ఘటన వల్ల పెళ్లి ఆగిపోయందని అన్నాడు. తాను మానసికంగా, శారీరకంగా ధృడంగా అయిన తర్వాత, ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత మరో మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నాడు.