గొడవ పడని భర్త నాకు వద్దు అంటూ కోర్టుకు పోయిన భార్య…


భార్య భర్తలు విడాకులు ఎందుకు తీసుకుంటారు? విబేధాలు, వరకట్న వేధింపులు, గృహహింస వంటి కారణాలతో. కానీ, ఓ భార్య మాత్రం ఎవ్వరూ ఊహించని కారణంతో విడాకులు కోరింది. సంవత్సరం పాటు సాగిన వైవాహిక జీవితంలో భర్త ఒక్కసారి కూడా తనతో గొడవ పడలేదని, ఒక మాట అనని, ఒక దెబ్బవేయని అంత మంచి మొగుడితో తాను వేగలేనని తేల్చి చెప్పింది.

వినడానికి వింతగా ఉన్నాఅక్షరాలా నిజం. యూఏఈలోని షరియత్ కోర్టుకు ముందుకు ఈ కేసు వచ్చింది. షార్జాకు చెందిన జంటకు ఏడాది క్రితం వివాహం జరిగింది. మంచి మొగుడితో మొహం మొత్తిన భార్యమణి జీవితం నిస్సారంగా ఉందని వాపోయింది. ఇంత ప్రశాంతమైన బతుకు బతకలేనని కోర్టును ఆశ్రయించింది. ‘నాకూ, నా మొగుడికి మధ్య ఎలాంటి గొడవలూ లేవు. అతని ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. అతనితో గొడవ లేకపోవడంతో నాకు నరకంగా ఉంది.. దయచేసిన నాకు విముక్తి ప్రసాదించండి.. ’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై న్యాయమూర్తి భర్తను ప్రశ్నించగా.. భార్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెతో తాను గొడవ పడలేనని చెప్పాడు. ఒకసారి తను బరువు తగ్గాలని కోరిందని.. చాలా కష్టమైనప్పటికీ ఆహార అలవాట్లను మార్చుకొని బరువు తగ్గానని తెలిపాడు. భార్యాభర్తల వాదనలు విన్న జడ్జి.. ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలంటూ తీర్పును వాయిదా వేశారు.

About The Author