కోడెల ఇంట్లో చోరీ కూడా ఒక డ్రామాయే…


మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి ఇంటిలో జరిగిన కంప్యూటర్ల చోరీ ఉత్తుత్తిదేనా? మీడియాలో వచ్చిన ఒక కదనం ప్రకారం అవి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన కంప్యూటర్లని తెలుస్తుది.వాటిని కూడా కోడెల తన ఇంటి లో అక్రమంగా వాడుకున్నారట. అయితే ఈ కంప్యూటర్ లు చోరీకి గురయ్యాయని ఎన్నికల ముందు వైసిపి నేత అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ నుంచి గతంలో కోడెల తన ఇంటికి తెప్పించుకున్నారు ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారని ఆ కధనం చెబుతోంది.

అయితే తాజాగా ఈ రోజు ఉదయం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి అప్పుడు పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పారు. ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు.దీంతో కంప్యూటర్ల చోరీ డ్రామా అని ఆ కధనం వివరించింది.

About The Author