తిరుపతి అర్బన్ జిల్లాలో విస్త్రుత స్థాయిలో తనిఖీలు…


పోలీస్ డిపార్టుమెంటు
అనుమానితులు వాహనాలు మరియు వస్తువులు గాని, పదార్థాలు గాని తెలిసిన ఎడల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి

అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్.

సార్,

జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామని నివాస స్థలాలు, రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, హైవే రోడ్ల యందు అనుమానితులు మరియు అనుమానిత వస్తువులు గాని, పదార్థాలు గాని తెలిసిన ఎడల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్ సహాయంతో నిరంతర తనిఖీలు జరుగుచున్నాయని, అలాగే తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎప్పుడైనా ఎక్కడైనా దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని తెలియజేస్తూ పలు సూచనలను ఈ సందర్భంగా అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారు తెలియజేసారు.

Ø జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి

Ø ఎప్పుడైనా ఎక్కడైనా దేనినైనా ఎదుర్కునేందుకు తిరుపతి అర్బన్ పోలీస్ సిద్దంగా ఉండాలి.

Ø 24×7 అందుబాటులో జిల్లా పోలీస్.

Ø అనుమానిత వ్యక్తులు గాని, వస్తువులు గాని కనిపిస్తే జిల్లా ప్రజలు డయల్ 100, వాట్సాప్ (8099999977), కు గాని, స్థానిక పోలీసులకు గాని సమాచారం అందించాలి.

Ø జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల దృష్ట్యా పోలీసుల నిఘా పటిష్ట చేయడం జరిగింది.

Ø శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసు నమోదు.

Ø తిరుపతి, తిరుమల, శ్రీ కాళహస్తి మొదలగు ప్రాముఖ్యత కలిగిన పుణ్య స్థలాల పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు.

Ø అనుమానించిన-అనుమానం కలిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా పటిష్టం చేసి తనిఖీలు చేపట్టామన్నారు. ఈ రోజు యూనివర్సిటీ వద్ద ఒక అనుమానిత కారు ఉందని ఫోన్ ద్వారా సమాచారం వచ్చిందని సమాచారం అందుకున్న వెంటనే డాగ్ స్క్వాడ్ మరియు బాంబు స్క్వాడ్ సహాయంతో కారును క్షుణ్ణంగా పరిశీలించి, ఏమి లేదని నిర్దారించడం జరిగిందని, ఇలాంటి అనుమానిత వాహనాలు, వస్తువులు ఎక్కడైనా ఉన్నట్టు సమాచారం తెలిసిన వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం అందించి జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని అవసరమైనచో తన ఫోను నెంబరు 9440796702 కు కూడా సమాచారం అందించవచ్చని ఈ సందర్బంగా తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ కె.కె.యన్.అన్బురాజన్ ఐ.పి.యస్ గారు కోరారు .

About The Author