ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు.


ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాశారని సమాచారం.

విశాఖపట్నం: ప్రముఖ తెలుగు రచయిత్రి జగద్ధాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉరేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. భర్త రామతీర్థ మరణం తర్వాత ఆమె మానసికంగా ఒంటరితనానికి గురైనట్లు చెబుతారు. రామతీర్థ కూడా సాహితీలోకానికి తన రచనల ద్వారా సుపరిచితులు

ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. ఒంటరితనం కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆమె రెండు లేఖలు రాసినట్లు సమాచారం. తనకు సంబంధించిన వస్తువులను అన్నింటిని రాజేష్ అనే యువకుడిగా ఇవ్వాల్సిందిగా ఆమె ఓ లేఖలో రాసినట్లు చెబుతున్నారు. రాజేష్ ఆమెకు నిత్యజీవితంలో చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నాడు.

తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని మరో లేఖలో ఆమె రాసినట్లు చెబుతున్నారు. ఈ రెండు లేఖలను కూడా స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆమె కవిత్వంతో పాటు విమర్శనా వ్యాసాలు కూడా రాశారు. అనువాదాలు కూడా చేశారు. కావ్య జ్యోతి పేరుతో ఆమె అనువాద కవితలతో ఓ ప్రముఖ దినపత్రికలో కాలమ్ నిర్వహించారు.

About The Author