ఎర్రచందనం దుంగలు పట్టివేత… ఒక తమిళ స్మగ్లర్ అరెస్టు…
రాగిమానుగుంట వద్ద 9 ఎర్రచందనం దుంగలు పట్టివేత: ఒక తమిళ స్మగ్లర్ అరెస్టు :
చిమ్మ చీకట్లో దట్టమైన పొదలు గల రాగిమానుగుంట వద్ద టాస్క్ ఫోర్స్ బృందం మంగళవారం తెల్లవారు జామున చాకచక్యంగా వ్యవహరించి ఒక స్మగ్లర్ తో పాటు 9 ఎర్ర చందనం దుంగలను పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పి రవిశంకర్ గారి ఆదేశాల మేరకు ఆఎస్ ఐ లింగాధర్, ఎఫ్ ఎస్ ఒ వెంకట సుబ్బయ్య, ఎఫ్ బిఒ కోదండం ల టీమ్ ఈతగుంట, చీకటీగల కోన, చచ్చినోడి బండ, కల్యాణి డామ్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ చేస్తుండగా స్మగ్లర్లు అడుగుజాడలు కనిపించాయి. వెంటనే అలెర్ట్ అయిన టాస్క్ ఫోర్స్ బృందం అడుగులను అనుసరిస్తూ వెళ్లగా ఈతమానుగుంట ప్రాంతంలో దాదాపు పది మంది స్మగ్లర్లు తారసపడ్డారు. టాస్క్ ఫోర్స్ బృందం వారిని పట్టుకునే ప్రయత్నం చేసింది. దట్టమైన అటవీ ప్రాంతం, చీకటి గా ఉండటం తో తొమ్మిది మంది తప్పించుకోగా ఒకడు పట్టు బడ్డాడు. తొమ్మిది దుంగలను చెల్లాచెదురుగా పడేసి తప్పించు కున్నారు. పట్టుబడిన స్మగ్లర్ పేరు స్వామినాథన్ కాగా ఇతను తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకా వీరప్పనూరుకు చెందిన వాడిగా గుర్తించారు. పది రోజుల క్రితం శేషాచలం అడవులకు వచ్చినట్లు అతను తెలిపాడు. సంఘటన స్థలానికి టాస్క్ ఫోర్స్ సిఐ సుబ్రమణ్యం, ఎస్ ఐ చంద్రశేఖర్ గౌడ్. చేరుకుని పరిస్థితి ని సమీక్ష చేశారు. ఎస్పీ రవి శంకర్ గారు లింగాధర్ టీమ్ ను అభినందించారు. ఇదే ప్రాంతంలో ఇప్పటివరకు ఆరు సార్లు పట్టుకున్నట్లు తెలిపారు.