ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు లాయర్లతో పాటు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వ కమిటీ….


ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది. రాష్ట్రఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కమిటీకి చైర్మన్ గా ఉంటారు. కమిటీలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స, ఆర్థిక మంత్రి బుగ్గన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌ సభ్యులు ఉంటారు. ఈ కమిటీ పరిశీలించే అంశాలను కూడా జీవోలో పేర్కొన్నారు. వీరితో పాటు చర్చి మతాధికారులు (ప్రీస్టులు) ఫాదర్లు, ఇమామ్‌లు, పాస్టర్స్‌, ఇల్లు లేదని పేదలతో పాటు ఇతర వర్గాలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు సంబంధించి ఇపుడున్న నియమ నిబంధనలు, విధానాలు పరిశీలించి… కొత్త విధానాన్ని ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.
జర్నలిస్టులకు సంబంధించి ఇంటి స్థలాలు కేటాయించడానికి అక్రిడేషన్‌/ కేడర్‌/ ఇపుడున్న నిబంధనలు/ ఎలక్ట్రానిక్‌మీడియా ఆధారంగా లబ్దిదారుల అర్హతలు నిర్ణయించడం, ఇంటి పట్టాలకు సరైన స్థలాలను ఎంపిక చేయడం, వ్యక్తిగతంగానా లేదా సముదాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలా అనే అంశాన్నికమిటీ పరిశీలిస్తుంది. అలాగే అలాట్‌మెంట్‌కు సంబంధించిన నియమ నిబంధనలతో పాటు జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపు

About The Author