టాలీవుడ్ కింగ్ నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.


సినీ మన్మధుడు అక్కినేని అందగాడు ఎవర్గ్రీన్ youngest హీరో అఫ్ ది ఫిలిం ఇండస్ట్రీ కింగ్ నాగార్జున. తన కొడుకులు తన ఏజ్ కి వస్తుంటే ఆయన మాత్రం వాళ్ళ ఏజ్ కి వెళ్లిపోతున్నారు. నాగార్జున, నటన చేత కాదు అన్న వాళ్లకు ఆయన ఒక నట సామ్రాట్. ఎప్పుడూ నీరసంగా ఉంటాడు నాగార్జున అన్న వాళ్లకు ఈరోజుకి ఆయన నట ఉత్తేజ తరంగం. హుషారు కి మారు పేరు. తన తోటి హీరోస్ 50వ పడిలో పెద్దతరం హీరోలు అయిపోతే గ్రీకు వీరుడు మాత్రం ఈనాటి హీరోలు తో పోటీగా `ఊపిరి` తీస్తున్నారు.
విక్రమ్ తో మొదలైన సినీ కెరీర్ కామాలు లేకుండా అలా సాగిపోతూనే ఉంది. తండ్రికి తగ్గ తనయుడిగా దేవదాసు ని మరిపిస్తూ మజ్ను అయ్యాడు. ప్రేమ కధలకు పెట్టింది పేరుగా మారారు.
ప్రేమకథలకు చిరునామా ఆయనే అయినా అన్నమయ్య గా మెరిసి శ్రీరామదాసుగా మురిపించారు. తండ్రి తో కలెక్టర్ గారి కొడుకు గా, కొడుకులతో మనం లో కలిసి నటించి ఫామిలీ తో నటించిన ఏకైక హీరో అయ్యారు. మంచి మనిషి గా వివాదాలు అప్పుడప్పుడు తన దరి చేరుతున్న డోంట్ కేర్ అన్నట్టు వచ్చినవి వచ్చినట్టే రిటర్న్ టికెట్ తీసుకుంటాయి అన్నట్టు ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఫామిలీ కి విలువ ఇస్తూ తన పరిధిలో సినీ ఇండస్ట్రీ కావాల్సిన విధంగా సాయం చేస్తూ తనో మంచి హీరో గానే కాదు మంచి మనిషి గా కూడా నిరూపించుకున్నారు డాన్ నాగార్జున.
ఈనాటి హీరోయిన్స్ కూడా ఒక్కసారి నటిస్తే బావుండు అనుకునే ఆనాటి యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీరు ఇంకా ఇంకా యంగ్ అవుతూనే ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు

About The Author