సెప్టెంబర్ 3 న సిరిధాన్యాలపై అవగాహన సదస్సు
ఆధునిక ఆహారపు అలవాట్లు మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి. రసాయన పురుగుమందులు, ఎరువులతో విషతుల్యమై, పోషక విలువలులేని ఆహార పదార్థాలతో వ్యాధినిరోధకశక్తి నిశిస్తున్నది. తద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ సమస్యలకు పరిష్కారంగా సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన సిరిధాన్యాలు వాడితే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, సిరిధాన్యాలను ప్రతిఒక్కరూ ఆహారంగా తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3న సికింద్రాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పద్మశ్రీ డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు.
కార్యక్రమంలో కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డాక్టర్ ఖాదర్‌వలి పాల్గొని దేశీయ ఆహారం, ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా సిరిధాన్యాలను అందుబాటులో ఉంచనున్నట్టు వెంకటేశ్వరరావు తెలిపారు.