ఏపీ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ను ప్రజల కోసం కేటాయించింది

 

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) కామెంట్స్

రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రవాణా శాఖ

ఏపీ రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9542800800ను ప్రజల కోసం కేటాయించింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరడా ఝలిపించింది. ఏపీ వ్యాప్తంగా ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ చేసిన. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా… రాంగ్ రూట్ లో వెళ్ళి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తున్నా…. మీరే ఒక పోలీస్ కావచ్చు. పైన చెప్పిన వాట్సాప్ నెంబర్ కు ఉల్లంఘనదారుల ఫోటోలు తీసి పంపవచ్చు. దీంతో వారిపై జరిమాన పడి రసీదును వారి ఇంటికి పంపుతారు. సరైన సమయానికి చెల్లించకపోతే లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.

పోలీసులు ప్రధాన కూడళ్లలో తప్పితే పట్టణాలు మరియు నగరాల్లోని గల్లీలు-రహదారులపై ఉండరు. అందుకే ప్రజలనే పోలీసులుగా మారుస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు శిక్ష వేసేలా ఏపీ రవాణాశాఖ సరికొత్త ప్లాన్ చేసింది. సమాచారం అందించిన వారి వివరాలను కూడా వారు గోప్యంగా ఉంచుతారు.

About The Author