పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను KCR సందర్శించారు…
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కీలక రిజర్వాయర్ అయిన కరివేన ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏరియల్ వ్యూ నిర్వహించి అనంతరం ఇంజనీర్లు అధికారులు వర్క్ ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కరివెన రిజర్వాయర్ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలకు సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. “మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్ చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్టులు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని ఎండలు ముదురక ముందే పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేటాల్లకు రైతుల పంటలకు మన నీళ్ళందే తట్టుండాలే.
ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్యలు లేవు అక్కడ కాలేశ్వరం ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. అక్కడక్కడ కొన్ని ఫినిషింగ్ పనులు తప్ప పెద్ద పనేమీలేదాడ. ఇక మన దృష్టి అంతా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ మీదనే కేంద్రీకరించాలి. మీ మిషన్లను కూడా పెంచండి. త్వరితగతిన పనులు పూర్తి చేసినప్పుడు మీకు ఇంటెన్స్ వ్లు ఇస్తాం. ఒకవేళ చేయలేకపోతే ఆ విషయం కూడా మాకు స్పష్టం చేయాలి తప్ప పనుల్లో తాత్సారం జరగడానికి వీలు లేదు. వచ్చే వానకాలం వరకు పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలి” అని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇంకా ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేసి అక్కడనుండి వట్టెం ప్రాజెక్టు పరిశీలనకు వాయు మార్గంలో బయలుదేరారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ సంతోష్ కుమార్ జోగినపల్లి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, శ్రీ రాములు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే శ్రీ నరేందర్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు, సీఎంఓ అధికారులు శ్రీమతి స్మితాసభర్వాల్ నీటిపారుదల శాఖ ఈ.ఎన్.సి శ్రీ మురళీధరరావు, సిఈ శ్రీ రమేష్ కుమార్ తదితరులున్నారు.
Hon’ble Chief Minister Sri K. Chandrashekar Rao on Thursday visited Karivena Project, which is considered as the key reservoir under Palamur lift irrigation scheme. As part of the visit, the CM inspected the ongoing works through an aerial view and reviewed the progress of works with the officials, engineers and work agencies concerned. CM said that since Karivena reservoir plays a major role under Palamur-Ranga Reddy Lift Irrigation Project, works pertaining to the reservoir should be completed on a war footing and directed the Engineers and work agencies to act accordingly. The CM said that the existing works need to be taken up uninterruptedly in three shifts per day and the construction should be completed at the earliest. He said required bills would be cleared on the same day and one need not worry regarding the delay of the payment. The CM also pointed out that, ‘There is a need to increase the workforce and those working in shifts. “Official machinery will always be there for any support. Keep four and half-month period as the target before the summer begins and all works have to be completed before the advent of the monsoon. By this time, farmers should get water into their fields’.
The CM further said, “You have no major issues and there is no need to look into issues like land procurement. The Kaleshwaram project works are almost completed. There are a few finishing touches required and all major works are over, all our attention should be focussed on the Palamur-Rangareddy Lift Irrigation Project. There is a need to increase the existing machinery. For completing the works at rapid speed incentives will be announced. If you are unable to complete works on the specified time, bring it to our notice. Don’t allow anything to cause hindrance to the desired targets. By next monsoon, works should be completed and we must be able to give water for farmers. Efforts have to be made towards this endeavour’.
After discussing other related issues, CM has given directions to MLAs, officials, work agencies and later, he left for Vattem project by the helicopter.
Ministers Sri Niranjan Reddy, Sri Srinivas Goud, MP Sri Santosh Kumar Joginapalli, Sri Srinivas Reddy, Sri Ramulu, local MLA Sri Alla Venkateshwar Reddy, Kodangal MLA Sri Narender Reddy and other public representatives, CMO Secretary, Ms. Smitha Sabharwal, Irrigation E-N-C Sri Muralidhar Rao, CE Sri Ramesh Kumar accompanied the CM during the visit.