సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం శ్రీ వై.యస్‌.జగన్‌ సమీక్ష…


సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం శ్రీ వై.యస్‌.జగన్‌ సమీక్ష

రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టళ్లలో క్వాలిటీ ఉండాలి, అధికారుల దృష్టి దానిమీద ఉండాలి: సీఎం
అధికారులు క్రమంగా తప్పకుండా వాటిని పరిశీలించండి, తనిఖీలు చేయండి
కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో చూడండి:
స్కూళ్లకు సంబంధించి 9 రకాల సౌకర్యాలు ఏర్పాటుచేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. మూడు దశల్లో ఈ సౌకర్యాలను కల్పిస్తున్నాం:
అలాగే రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హాస్టల్స్‌లో కూడా చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళిక తయారుచేయండి : సీఎం
మంచాలు, బ్లాంకెట్స్‌ సహా అన్ని సౌకర్యాలూ హాస్టళ్లలో ఉండాలి, మూడు దశల్లో ఈ పనులు పూర్తికావాలి: సీఎం
హాస్టళ్లలో పిల్లలకు మంచాలు ఉన్నాయా? లేవా? దుప్పట్లు్ల్ట ఉన్నాయా? లేవా? అల్మరాలు ఉన్నాయా? లేదా? వీటన్నింటినీ పరిశీలించి.. ఈ కనీస సదుపాయాలను కల్పించాలి: సీఎం
మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి: సీఎం

డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశం
హాస్టళ్లలో వసతుల సౌకర్యంకోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అన్నదానిపై సీఎం ఆరా, ఇచ్చామని అధికారుల సమాధానం
టాయిలెట్స్‌ను ప్రతి హాస్టల్‌లో వెంటనే ఏర్పాటు చేయాలని, ప్రయార్టీ ప్రకారం చేయాలని సీఎం ఆదేశం
309 హాస్టళ్లలో కుక్స్, వాచ్‌మన్‌ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆదేశం
వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారమ్స్, పుస్తకాలు అందాలి.

ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలన్న సీఎం

నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ వర్కుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ఆదేశం. కలెక్టర్లకు స్పష్టంగా చెప్పాలన్న సీఎం.

వైయస్సార్‌ చేయూత కింద లబ్దిదారులను గుర్తించే పని మొదలుపెట్టండి: సీఎం
వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ.18750లు, సంతృప్తికర స్థాయిలో వైయస్సార్‌ చేయూత
రాజకీయాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ అందాలి
పథకాల అమల్లో పారదర్శకత ఉండాలి: సీఎం

సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ
పాడేరులో ట్రైబల్‌ మెడికల్‌ కాలేజీ
కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ
7 ఐటీడీఏల్లో సూపర్‌ స్పెషాల్టీ హాస్పటిల్స్‌
అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్‌.పురం, దోర్నాలలో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్, ఆమేరకు ప్రతిపాదనల తయారీకి సీఎం ఆదేశం

గిరిజనులకు అటవీభూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం, ఈవిషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టిపెట్టాలని ఆదేశం

ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు
ఈమేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ఆదేశం

About The Author